Swaramu Suswaramina

సంగీత ప్రియులకు శుభోదయం,

భగవంతుడు సృష్టిలోని ప్రాణులందరికి స్వరము యిచ్చాడు ప్రియోక్తులు పలుకను, తమ కున్న రాగ, బావాలను యితరులకు తెలియ జేయును. వేలలో కొందరికి శ్రావ్యమైన కంఠము యిచ్చాడు వేంకటేశ్వరుడు. యితరులను అలరించే సుమధుర కంఠము దేముడిచ్చున ఒక వరం. ఆ వరాన్ని సద్వినియోగము చేసుకొనే భాగ్యం కోట్లలో కొందరికే దక్కుతుంది.

శ్రీ శ్రీ శ్రీ అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు వంటి మహానుభావులకు, భగవంతుడు కవిత చేయు కౌశలము, స్వర కల్పన శక్తి, సంగీతము చేయు స్వరము యిచ్చాడు. అలాంటి వాగ్గేయ కారులను వేళ్ళ మీద లెక్కించ వచ్చు. ఆ కళ లన్నీ మనకు దక్కక పోయిన, మన యందరికి ఎదో ఒక శక్తిని యిచ్చాడు. అదే సంగీంత వినే శక్తి. సృష్ఠిలో ప్రతి ప్రాణికి సంగీతం ప్రియమే. భగవంతుడు మీకు సంగీతం పలికించే అద్భుత శక్తి నిచ్చాడు, దాన్ని సమస్త మానవాళికి ఉపయోగించే విధంగ భగవంతుని సేవకు వినియోగించండి.

రమాకాంతరావు చాకలకొండ ( Cincinnati, OH, USA)

పల్లవి. స్వరము సుస్వర మైన సంగీతమే!
వరముగ దొరకగ శ్రావ్యమగు కంఠము! ||స్వరము||

అనుపల్లవి. హరి కీర్తన యందు హృద్యముగ పొంగిన,
ఔర! యది గాదే వినువారి భాగ్యము. ||స్వరము||

1. ఇల లోన యందరికి కంఠములు యున్నా,
కల రవము వంటి కమ్మని కంఠముతో,
ఆలాపన చేసి అలరించు వరము,
వేలలో కొందరికే దొరకెడి భాగ్యము. ||స్వరము||

2. మాధుర్య వీణయై మాటలు వెలువడ,
శ్రోతల ఎదలోన అమృతము నిండగ,
సుధ లొలుకు సుమధుర స్వరములు చేసెడి,
మాధవ కీర్తనే మహిలోన భాగ్యము. ||స్వరము||

3. మురళి గానముతో మధురముగ కలిసి,
పరవశము నొందుచూ పరవళ్ళు తొక్కగ,
తిరువేంకటేశుని తత్వము పాడెడి,
స్వరము అరుదుగ దొరకు మహభాగ్యము. ||స్వరము||

రమాకాంతరావు చాకలకొండ సోమవారం, 07 అక్టోబర్ 2013

Download (PDF, 38KB)

Santasamu

పల్లవి. సంతసము సమకూర్చు సామగానం,
సంతృప్తి నిచ్చును సామగానం! ||సంత||

అనుపల్లవి. సంతాపము తీర్చు సామగానం,
సంతతము శుభకరము సామగానం! ||సంత|| సంతతము = నిత్యము, ఎల్లప్పుడు

1. మది ఆర్తి తీర్చును సామగానం,
ముదము కలిగించును సామగానం,
వ్యాధులకు ఔషధము సామగానం,
మాధవ ప్రియము సామగానం. ||సంత||
2. శక్తిని కలిగించు సామగానం,=,
ముక్తి మార్గము తెలుపు సామగానం,
భక్తిని కలిగించు సామగానం,
రక్తిగ ఎంచుము సామగానం. ||సంత||

3. వెతలు తొలగించును సామగానం,
ఎద బరువు తీర్చును సామగానం,
బ్రతుకు బాటను జూపు సామగానం,
నిత్యము చేయుము సామగానం. ||సంత||

4. కర్తవ్యము గరుపు సామగానం,
ఆర్తి అగ్నికి జలము సామగానం,
ఆరాధన పథము సామగానం,
హరి ప్రియ మార్గము సామగానం. ||సంత||

5. కన్నీరు తుడుచును సామగానం,=,
మానవత్యము నేర్పు సామగానం,
వెన్నుడు మెచ్చెడి సామగానం,
ఎన్ను కొనుము నేరి సామగానం. ||సంత||

రమాకాంతరావు చాకలకొండ ఆదివారం, 06 అక్టోబర్ 2013

Download (PDF, 35KB)

Manasu Mroginadi

పల్లవి. మనసు మ్రోగినది మాధుర్య వీణయై,
కను ముందు హరి రూపు కమ్మగ తలచి . ||మనసు||

అనుపల్లవి. అణువణువు పులకించి అమృతంబైనది,
మనసు మురళీ ధరుడు మాధవుని తలచి. ||మనసు||

1. వేణువై మనసు గానము చేసినది,
కన్నయ్య రూపము కల్పనలో తలచి,
వెన్నయై కరిగినది వయ్యారి హృదయము,
వెన్న దొంగను మదిన విరివిగ తలచి. ||మనసు||

2. బృందావన మధుర తీరముగ మారినది,
నంద నందనుని ఎద నిండ తలచి,
సుందరమై, చందమై సొంపుగ మారినది,
చందన చర్చితుని వూహల తలచి. ||మనసు||

3. విరిలాగ విరిసినది వలపుతో హృదయము,
సిరి నాధు రూపము సొగసుగ తలచి,
మర్మము ఎఱుగని ముత్యమై మెరసినది,
తిరు వేంకటేశుని తియ్యగ తలచి. ||మనసు||

రమాకాంతరావు చాకలకొండ 26 సెప్టెంబర్ 2013

Download (PDF, 34KB)

Tirumala Dasuni Toli Vandanamu

విఘ్నద్వా న్త నివారణైక తరణి, ర్విఘ్నాటవీ హవ్యవాట్,
విఘ్నవ్యాళకుల ప్రమత్తగరుడో, విఘ్నేశ పంచాననహ
విఘ్నోత్తుజ్ఞగిరి ప్రబేదనకరీ, విఘ్నాబ్ది కుమ్బోద్బవహ
విఘ్న ఘౌ ఘఘన ప్రచండ పవనో, విఘ్నేస్వ రహ పాతునః

పల్లవి. తిరుమల దాసుని తొలి వందనం,
గిరిజ తనయుడు గణపతికే. ||తిరుమల||

అనుపల్లవి. వేంకట సుతుని మలి వందనము,
సంకట హారి శ్రీ గణపతికే. ||తిరుమల||

1. ప్రఙ్ఞావంతుల ప్రధమ వందనము,
విఘ్ననాశకుడు వినాయకునికే,
సుఙ్ఞాన సత్పురుష వందనము,
విఙ్ఞాన విద్య కర గణపతికే. ||తిరుమల||

2. నాద బ్రహ్మల ఆది వందనము,
మోదక హస్తుడు మహాగణపతికే,
విద్యా గణముల విమల వందనము,
వేద వేద్యుడు వర గణపతికే. ||తిరుమల||

3. తుంబుర, నారదు తొలి వందనము,
అంబిక తనయుడు లంబోదరునికే,
కుంభిని జనుల శిరో వందనము, (కుంభిని = భూమి)
అంబుజ నయనుడు ఆది గణపతికే. ||తిరుమల||

రమాకాంతరావు చాకలకొండ శనివారం, 07 సెప్టెంబర్ 2013

Download (PDF, 127KB)

Swami Swarupa

Good morning – See you in Novi Sri Venkataswra temple today.

పల్లవి.
స్వామి స్వరూప సంవిత్తి నిచ్చిన,
రామానుజ స్వామి ఋణగ్రస్తులము. ||స్వామి||

అనుపల్లవి.
తిరువేంకటేశుని తత్వము తెలిపిన,
ఆళ్వారులందరికి ఆత్మ వందనము! ||స్వామి||

1.
నారాయణ నుతి విధులను తెలిపిన,
నారద స్వామికి నిత్య వందనము,
శౌరి సంసేవన సంపూర్తి తెలిపిన,
గురులు వైష్ణవులకు గరిమ వందనము. ||స్వామి||

2.
భాగవత చరితను జగతి కందించిన,
నిగమ గురు వ్యాసునికి నమ్ర వందనము,
జగత్ విఖ్యాత భక్త పోతన్నకు,
తగు రీతి శ్రద్ధతో శిరో వందనము. ||స్వామి||

3.
శ్రీధరుని సేవించు మార్గము తెలిపిన,
పెద్ద జీయరుకు పాద వందనము,
నిద్ర ముణిగిన మాకు చైతన్య మిచ్చెడి,
వేది చిన జీయరుకుభక్తి వందనము. ||స్వామి||

4.
వెన్నుని కీర్తి గానము చేసిన,
అన్నమయ్యలకు అమల వందనము,
ఎన్నెన్నో రీతుల ఏడు కొండల వాని,
సన్నతించెడి మనకు స్వీయ వందనము. ||స్వామి||

రమాకాంతరావు చాకలకొండ ఆదివారం, 02 జూన్ 2013

Download (PDF, 25KB)

Prabhodha Geetham – Nirasa Nispruha

పల్లవి.
నిరాశ, నిస్పృహ నిండిన కన్నులతో,
ధైర్యము బాసిన దమన యువతా! ||నిరాశ||

అనుపల్లవి.
కలదు నీ కను ముందు భావి భవితవ్యము,
అలత వీడి కదిలి అందుకో విజయము. ||నిరాశ||

1.
నిద్ర మగతను వీడి, నులిపి కన్నులు చూడు,
అద్రి యంత ఘనత అదిగో నీ ముందు,
మది లోన ధైర్యపు మకరందము నింపి,
అతులిత సఫలత అమృతము నందుకో. ||నిరాశ||

2.
నూన్య భావము తోటి నలిగి సన్న బడకు,
మాన్యమగు ధీరత మది నిండ నింపుకో,
ఘన కీర్తి బడసెడి కార్యము నీకున్నది,
మౌన ముద్రను వీడి ముందుకు సాగిపో. ||నిరాశ||

3.
కార్య దీక్షత బూని కదులు మున్ముందుకు,
వీర వన్నెల జాతి భారతావని పౌర!
ధీరుడవై శూరుడవై కర్తవ్య బద్ధుడవై,
దొరికించు కొనుము విజయ పతాకము. ||నిరాశ||

రమాకాంతరావు చాకలకొండ శుక్రవారం, 31 మే 2013

Dear Friends,

This song attached Prabhoda Geethamu.

Hey Young man! With depression, and disappointment stuck youth, you lost self-confidence. Weak up, there is a bright future waiting for you, get rid of your worries and achieve the great success. Get rid of the laziness and open up. There is a future which of mountain size, grab it. Fill honey sweat boldness in your heart and achieve manna like success. Get rid of the feeling of emptiness in your heart, fill the great confidence in its place. You have the great task of achieving success waiting for you, leave your silence and jump into action. Start fresh with determination; you belong to the great Indian nation whose quality is boldness. Like a bold solider be action oriented and catch the flag of success and hoist it.

Dear Youth! Be bold and action oriented and achieve your objective of life, GOD is with you.

Best wishes,
Ramakanth

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


Download (PDF, 40KB)

Prabhodha Geetham – BantilaYeguravale

పల్లవి.
బంతిలా ఎగుర వలె పైకి పైకి,
ఎంత కిందికు కొట్ట అంతకంటే పైకి ||బంతిలా||

అనుపల్లవి.
చెండులా చూపవలె చురుకు దనము,
బెండులా వంగక భీతితో హృదయము. ||బంతిలా||

1.
ముద్దల ఒక మూల పడి యున్న బంతికి,
మొద్దులా పని చేయక కూర్చున్న వానికి,
వదలని దుమ్మోకటే ఒళ్ళంతా పట్టును,
లేదు రాదు వారికి ప్రగతి, పదవి, ఖ్యాతి. ||బంతిలా||

2.
దెబ్బలకు భీతిల్లిన బంతి పైకెగయునా?
నిప్పులకు భయపడిన బంగరు నగ యగునా?
నొప్పులకు వోర్వకున్న ఇనుము పలుగగునా ?
తప్పులకు జడసిన తఱలు కీర్తి దొరకునా? ||బంతిలా||

3.
పని చేయు వారికే పదవి, భాద్యత, భారము,
పని చేయు వారికే పట్టు వైభోగము,
పని విముఖుడు ప్రగతి లేని పెద్ద రాయి సమము,
పని లోనే ఉన్నది పరమానందము. ||బంతిలా||

రమాకాంతరావు చాకలకొండ మంగళవారం, 28 మే 2013

Friends,

This song attached Prabhoda Geethamu.

We should bounce like a ball, the more you are pushed down, to the more higher heights. We should show the sharpness of a ball in our movement, we should not get broken out of fear, for small difficulties. The one who sits like a mud ball in a corner or a ball unused lying in a corner, only accumulate dust, there is no progress for them. If balls is worried about kicks, how it can rise to top? If gold is worried about fire, how it can become an ornament? If iron is worried of strikes how it can get sharpen like an weapon? If you are worried that you may make mistakes, how you can you can win success? Those who work will get famous, position and responsibility, they only get wealth. The person who does not work is like a big unused stone. Only in work you can derive pleasure.

Friends, make your life happy filling all these good qualities, GOD is with you.

Best wishes – Ramakanth

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

PDF:

Download (PDF, 42KB)


Prabhodha Geetham – Vuti Yekka Lenivadu

పల్లవి. ఉట్టి ఎక్కలేని వాడు, వైకుంఠము ఎక్కునా?
పట్టు దల లేని వాడు, పరమార్ధము పొందునా? ||ఉట్టి||

అనుపల్లవి. ఒట్టి ఆలోచనలు విజయములు తెచ్చునా?
కష్ట పడక కూర్చున్న, కార్యము సిద్ధించునా? ||ఉట్టి||

1. నారు పోసి, నీరు పోసి వ్యవసాయము చేయకున్న,
వరి పంట పండునా? మన కడుపు నిండునా?
గురి పెట్టి వదల కున్నా, గొప్ప అణు బాణ మైనా,
వైరి గుండె చీల్చునా, విజయము కొని తెచ్చునా? ||ఉట్టి||

2. ఆలోచన ఉన్నంతనే ఐస్వర్యము దొరకునా?
తలపులు ఉన్నతమైనా, గెలుపులు సిద్ధించునా?
కలసి కట్టు కృషి చేయక, కొండ కూల్చగలనా?
నిలిచి ఎదురు పోరాడక, విజయము సాధించ గలనా? ||ఉట్టి||

3. గంధర్వులు వచ్చి మన కార్యములు చేతురా?
ముందు మనము నిలువ కున్న, పనులంటూ సాగునా,
అందరిని కలుపు కొననక, ఆదర్శము నిలుచునా
పొందిన ఏ పదవులైన, పదికాలము లుండునా. ||ఉట్టి||

4. చిన్ని కృషి చేయకనే, ఘన విజయం దొరకునా,
చిన్ని మొక్క పెరుగకే , ఫల వృక్షమై ఎదుగునా?
పని విలువ తెలియ కున్న, ఫలితము సిద్ధించునా?
మానవ కృషి జరుగు కున్న, మనుగడ యిక సాగునా? ||ఉట్టి||

రమాకాంతరావు చాకలకొండ సోమవారం, 27 మే 2013

Dear Friends,

This song attached Prabhoda Geethamu.

Having high thoughts is not enough, just by thinking only, nothing gets materialized. Good thoughts have to be converted to actions, hard work, then achievement is at your door step. If you want to eat paddy rice, one of us have to go to field, seed, water and cultivate, then only our stomach will be full. Even if it is a sharp arrow, it has to be carefully aimed at the enemy, then only you can defeat him. Same thing is true for your ambition. Having high ambition is good, but you have to work hard to win that. Success is the main product of hard work. Sometimes we have to work by ourselves, sometimes we have to make a group effort. We cannot blast a hill individually, at that time we require a group effort. We should stand together and boldly fight against difficulties against odds, to win success.

There is a proverb in Telugu “కాగల కార్యము గంధర్వులే తీర్తురు”, means some celestial people will come and work for your success. In practical life that is not true. You have to work for your success. Nobody is going to achieve success for you, even if your employees. You have to stand in the forefront, lead them, and then only you can achieve your target. The main character of a successful leader is to keep unity of his group, lead them with objectives. Otherwise winning positions and fruits of success is impossible.

With small efforts only great success knocks your door. If you plant a small fruit tree, that grows, and gives your fruit. All your millions are hidden in your hard work/ Things you think impossible on earth, become possible by dedicated, object oriented hard work. Remember what Bhartuhari said –

ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయస సంత్రుస్తులై
ఆరంభించిబరిత్యజింతుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్న నిహస్య మానులగుచున్ థృత్యున్నతోత్తాహులై
ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్.

తాత్పర్యం :
ఆంటకాలకు భయపడి నీచులు ఎలాంటి కార్యాన్ని మొదలుపెట్టలేరు. కార్యాన్ని మొదలుపెట్టి, విఘ్నాలు కలిగితే వదలిపెట్టేవారు మధ్యములు. ధీరులు, తెలివిగలవారు మాత్రం ఎన్ని విఘ్నాలు కలిగినా ధైర్యంతో.. గొప్ప ప్రయత్నం చేసి మొదలుపెట్టిన దానిని వదలకుండా పూర్తి చేస్తారు.

Friends, make your life happy filling all these good qualities, GOD is with you.

Best wishes,
Ramakanth

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


Download (PDF, 80KB)

Prabhodha Geetham – Chikula mayame

పల్లవి.
చిక్కుల మయమీ జీవిత మార్గము,
చక్కగ మల్చుక సాగాలి. ||చిక్కుల||

అనుపల్లవి.
నిగ్గగు ధైర్యము నిరతము నిండుగ,
నెగ్గను గుండెకు కావాలి. ||చిక్కుల||

1.
గెలుపు ఓటమిల గజి బిజి యాటే,
యిలలో బ్రతుకని ఎఱగాలి,
తెలిసి తెలియక చేసిన తప్పులు,
తెలివిగ దిద్దుక పోవాలి. ||చిక్కుల||

2.
కష్ట, నష్టములు కలిసి వచ్చిన,
నిష్ఠగ ముందుకు దూకాలి,
దుష్టు లెందరో దారిని యడ్డిన,
పుష్టగు శౌర్యము చూపాలి. ||చిక్కుల||

3.
పట్టుదల, పని సామర్ధ్యములే,
గట్టిగ గుండెన నిండాలి,
దిట్టదనంతో ధీరత వీడక,
పట్టిన పట్టుతో నిలవాలి. ||చిక్కుల||

4.
నిరాశ, నిస్పృహ నిర్వీర్యాన్ని,
నరికి పోగులు పెట్టాలి,
వీరుడవై, రణ శూరుడవై,
కర్తవ్య దృష్టితో సాగాలి. ||చిక్కుల||

5.
అలుపు, అలత ఆవాల పెట్టి,
నిలిచి ముందుకు నడవాలి,
గెలుపు ఒక్కటే గమ్యము గెంచి, మెరు
పులా ముందుకు ఉరకాలి. ||చిక్కుల||

రమాకాంతరావు చాకలకొండ శనివారం, 25 మే 2013

Dear Friends,

This song attached Prabhoda Geethamu. Life is not a bed of roses. There are so many thorns in the life’s path. Difficulties are part of the life, we have to encounter all kinds of people in our day to day life. We have to set our life’s objective and march forward to reach our target, with unshaken determination. Defeat and success are part of the story that is what life’s game is. Sometimes we also do mistakes knowingly and unknowingly. At the times of difficulties we should not lose heart, we should get double strong, and march forward with double confidence and strength to achieve our goal. Determination and efficiency are the two things to achieve success, hard work and determination are the only things required to win and be successfully in life. We should not allow depression, pessimism, lack of confidence come near us. We should kill these bad thoughts that may come in the mind. We should only aim at success. We should not get tired, get upset for anything, we should aim at our objective and march forward like a lightening.

Friends, make your life happy filling all these good qualities, GOD is with you.

Best wishes,
Ramakanth

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


Download (PDF, 29KB)

Fury of natural elements

Dear Friends,

How are you.

You would have heard the devastating tornado in Oklahoma.

Now a days we are seeing the fury of natural elements, in terms of Tsunami, tornado’s, wild fires, earth quakes, blowing heat etc. The man who thinks he is the most powerful in the creation, had to helplessly watch the blow? What is the solution for this?

పల్లవి.
ఏమి యీ ప్రకృతి వైపరీత్యములు?
భూమిపై జరిగెడి భీకర కృత్యములు! ||ఏమి||

అనుపల్లవి.
ప్రాణములు నిలిపెడి పంచ భూతములే,
ప్రాణములు తీయునా ? ఏమి యీ చోద్యము ? ||ఏమి||

1.
ఊపిరిచ్చెడి గాలే ఓపిక వీడి,
తాప ప్రభంజనమై తుఫాను రేపునా?
అపురూప చంద్ర ప్రభ ఆకాశ పథమే,
నిప్పులు చెరగుచూ నిర్ధయ జూపునా? ||ఏమి||

2.
దాహములు తీర్చెడి తియ్యని జలములే,
అహంకార జలధై ఆక్రోశము జూపా?
స్నేహభావము వీడి శుద్ధి చేసెడి అగ్ని,
ద్రోహము చేయునా దగ్ధ జ్వాలగ మారి? ||ఏమి||

3.
అన్నము, నీడ అందించు అవనియే,
ఖిన్నత జూపి కంపించి కూల్చునా?
ఎన్నేనో శక్తులతో విఱ్ఱవీగెడి నరుడు,
వీని ముందు ఓడి తలవంచు కొనునా? ||ఏమి||

4.
ప్రకృతి నిమ్మళ నైజము విడనాడి,
వికృతాకృతిలో విషాదము నింప,
సకల, సృష్ఠి, స్థితి, లయ కారకుండైన,
శ్రీకరుడు వేంకని శరణమే దిక్కు. ||ఏమి||

రమాకాంతరావు చాకలకొండ బుధవారం, 22 మే 2013