Category Archives: Uncategorized

Vara Venkatesudu

పల్లవి. వర వేంకటేశుడు వర్ధిల్ల అందించే,
శారద పుత్రునికి శుభము శుభము . ||వర||

అనుపల్లవి. మంగమ్మ నాధుడు మంగళము అని యిచ్చె,
మంగళా శాసనము శుభము శుభము. ||వర||

1. ఆయు రారోగ్యములు, అష్టలక్ష్మీ కృపలు,
తోయజాక్షి యిచ్చె శుభము శుభము,
వేయి నామముల వెన్నుడు మీకిచ్చె,
మాయని సంతసము శుభము శుభము. ||వర||

2. మోహనా కారుడు మంగమ్మ పతి యిచ్చె,
యిహ పర భాగ్యములు శుభము, శుభము,
స్నేహ , కరుణా శీలి, శ్రీనివాసుడు యిచ్చె,
సహన, శాంతి, ఖ్యాతి శుభము, శుభము. ||వర||

3. చోడవరపు వారి అష్ఠమ బిడ్డకు,
నేడు, నిన్న, రేపు శుభము, శుభము
మేటి విద్యలలో మింటి కెగసిన మీకు ,
దీటుగ అన్నింట శుభము, శుభము. ||వర||

4. అమ్మ సీతమ్మ, శేఖరుల బిడ్డకు,
కామితార్ధములతో శుభము శుభము,
కొమ్మ రేణుక – మీ , కన్న బిడ్డలకు,
కొమ్మని హరి యిచ్చె శుభము, శుభము. ||వర||

రమాకాంతరావు చాకలకొండ,
M.Sc, MA, M.Com, M.Tech, M.Tech(IT), MBA, MCA, M.Phil, PGDM, PG Dip IR&PM

Date: శనివారం, 21 సెప్టెంబర్ 2013

Download (PDF, 44KB)

Manasu Mroginadi

పల్లవి. మనసు మ్రోగినది మాధుర్య వీణయై,
కను ముందు హరి రూపు కమ్మగ తలచి . ||మనసు||

అనుపల్లవి. అణువణువు పులకించి అమృతంబైనది,
మనసు మురళీ ధరుడు మాధవుని తలచి. ||మనసు||

1. వేణువై మనసు గానము చేసినది,
కన్నయ్య రూపము కల్పనలో తలచి,
వెన్నయై కరిగినది వయ్యారి హృదయము,
వెన్న దొంగను మదిన విరివిగ తలచి. ||మనసు||

2. బృందావన మధుర తీరముగ మారినది,
నంద నందనుని ఎద నిండ తలచి,
సుందరమై, చందమై సొంపుగ మారినది,
చందన చర్చితుని వూహల తలచి. ||మనసు||

3. విరిలాగ విరిసినది వలపుతో హృదయము,
సిరి నాధు రూపము సొగసుగ తలచి,
మర్మము ఎఱుగని ముత్యమై మెరసినది,
తిరు వేంకటేశుని తియ్యగ తలచి. ||మనసు||

రమాకాంతరావు చాకలకొండ 26 సెప్టెంబర్ 2013

Download (PDF, 34KB)

Tirumala Dasuni Toli Vandanamu

విఘ్నద్వా న్త నివారణైక తరణి, ర్విఘ్నాటవీ హవ్యవాట్,
విఘ్నవ్యాళకుల ప్రమత్తగరుడో, విఘ్నేశ పంచాననహ
విఘ్నోత్తుజ్ఞగిరి ప్రబేదనకరీ, విఘ్నాబ్ది కుమ్బోద్బవహ
విఘ్న ఘౌ ఘఘన ప్రచండ పవనో, విఘ్నేస్వ రహ పాతునః

పల్లవి. తిరుమల దాసుని తొలి వందనం,
గిరిజ తనయుడు గణపతికే. ||తిరుమల||

అనుపల్లవి. వేంకట సుతుని మలి వందనము,
సంకట హారి శ్రీ గణపతికే. ||తిరుమల||

1. ప్రఙ్ఞావంతుల ప్రధమ వందనము,
విఘ్ననాశకుడు వినాయకునికే,
సుఙ్ఞాన సత్పురుష వందనము,
విఙ్ఞాన విద్య కర గణపతికే. ||తిరుమల||

2. నాద బ్రహ్మల ఆది వందనము,
మోదక హస్తుడు మహాగణపతికే,
విద్యా గణముల విమల వందనము,
వేద వేద్యుడు వర గణపతికే. ||తిరుమల||

3. తుంబుర, నారదు తొలి వందనము,
అంబిక తనయుడు లంబోదరునికే,
కుంభిని జనుల శిరో వందనము, (కుంభిని = భూమి)
అంబుజ నయనుడు ఆది గణపతికే. ||తిరుమల||

రమాకాంతరావు చాకలకొండ శనివారం, 07 సెప్టెంబర్ 2013

Download (PDF, 127KB)

A welcome song to ChinaJiyar on his visit

Dear Friends,

I am attaching a welcome song on SWAMI CHINA JIYAR, on visit of his HIS HOLINESS to USA – 2013. Please read attachment and listen to the song. I am not a good singer. Please request one of the singers in your area to sing this song on HIS visit to your city if possible. Best wishes.

Ramaknatha Rao Chakalakonda, Cincinnati ,OH USA.

పల్లవి.
స్వాగతము గురు వర్య! యోగి వర్య!
స్వాగతము శ్రీహరి మార్గ దర్శ, భవ్య! ||స్వాగతము||

అనుపల్లవి.
స్వాగతము విద్యోత ఙ్ఞాన దీప్త సూర్య!
స్వాగతము త్రిడండి చిన జీయారార్య! ||స్వాగతము||

1.
వేద హయగ్రీవా!
నాద ప్రియ గంధర్వ,
నరహరి నామ ప్రియ,
సాధు స్వరూపా! ||స్వాగతము||

2.
అఙ్ఞాన తిమిర హర,
విఙ్ఞాన మణి ధర,
సుఙ్ఞాన మార్గ కర,
ప్రఙ్ఞాన భాస్కర! ||స్వాగతము||

3.
ఎనలేని సద్గుణ! వైరాగ్య శౌర్య!
అనుపమ అవతార ఆళ్వారు కార్య,
గొనుమ మా స్వాగతము మంగళ తూర్య,
వినిపించు నీ బోధ వైష్ణవా చార్య! ||స్వాగతము||

రమాకాంతరావు చాకలకొండ ఆదివారం, 19 మే 2013

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


SMay192013_Swagatamu

The life’s cycle

Good morning. It is always hard work that pays. In family hierarchy, some body works hard, earns for generations, if some body lazy in the family, they swindle that, again their heirs have to work hard for bread and butter and fix it. In that process they have to sacrifice their life for their children, again with hard work people stabilize, and the cycle again repeats. That is what life is!

పల్లవి.
తాత, తండ్రులు యిచ్చే తఱగని ఆస్ధి!
హిత మైన హరి నామ నవరత్న కోశము. ||కవి||

అనుపల్లవి.
ఎవ్వరికో అబ్బని అద్భుత శక్తి,
కవిత చేసెడి కోట్ల కరగని ఆస్థి. ||కవి||

1.
కోట్లాది ఆస్థులు కొల్ల గొట్టిర మాది,
నాడు దాయాదులు, దాస, బంధువులు,
పాడు అలవాట్లతో యిల్లు గుల్ల జేసె,
పడుచు తాత గారు పటు వంశ నిధులు. ||కవి||

2.
పంట పొలములను బీడు జేసె తాత,
ఇంట, బయట పనులు పట్టించు కొనక,
కొంటె తాత గారి భోగపు మేళములు ,
కంటి ముందే కార్చె కొండంటి నిధులు. ||కవి||

3.
కటిక దారిద్య క్లేశ వలయము చీల్చి,
పట్టుదలతో తండ్రి పెరిగి పైకొచ్చే,
మేటి విద్యలు గరుప బ్రతుకే త్యాగము జేసే,
సాటి లేని ఘనులు చెంచు రామయ్యలు. ||కవి||

4.
దారిద్య, అవమాన, ఈతి బాధల కడలి,
నేరులై యీదిరి, మా తల్లి, దండ్రులు,
తీరుగ వారు మా బ్రతుకులు దిద్ది,
కార్య సాధన లోనే కన్నులు మూసిరి. ||కవి||

5.
వారు జూపిని దారి వదలక కదిలి,
చేరితిము నేడు బ్రతుకు గమ్యముకు,
దరి నుండి మమ్ము నడిపించు దేముడు,
తిరు వేంకటేశ్వరుని శరణు జొచ్చితిమి. ||కవి||

రమాకాంతరావు చాకలకొండ గురువారం, 18 ఏప్రిల్ 2013

Happy Vijya Ugadi

పల్లవి.
చిరు లత పల్లవ సోయగ చందముతో,
తరలి వచ్చెను మరల తెలుగు ఉగాది. ||చిరు||

అనుపల్లవి.
మరు మాస నవ వధువై, మధుర గంధముతో,
మరల వచ్చెను మనకై విజయ ఉగాది. ||చిరు||

1.
చైత్ర శుద్ధ శుభ పాడ్యమి ఘడియలో,
అతి దివ్య ఆనంద జ్యోతులు వెలిగించ,
ప్రతి ఎదన సంతోష, సౌఖ్యములు పండించ,
కదలి వచ్చెను తెలుగు విజయ ఉగాది. ||చిరు||

2.
యిమ్ముగ వనములలో తరు, శాఖ, లతలపై,
కమ్మని రంగులతో కొమ్మ కొమ్మన విరిసి,
సొమ్ముగ సిగ్గుల పల్లవ పైటతో,
కోమలి లక్ష్మిలా వచ్చె ఉగాది. ||చిరు||

3.
హిమ శైలము పైన ముక్కంటి సతి జడలో,
ఘుమ ఘుమ చల్లను, మరుమల్లె కుసుమమై,
కమల కంఠము లోన కుసుమ మాలికయై,
అమల రూపము నొచ్చె విజయ ఉగాది. . ||చిరు||

4.
విజయ ధుంధుభులతో విశ్వ జను లెల్లరు,
నిజ వైభవానంద డోలికల ఊగగ,
అజులు అమర వీధి నాశీర్వదింపగ,,
విజయ పతాకముతో వచ్చె ఉగాది. ||చిరు||

5.
పుల్ల మామిడి చెరకు, బెల్లము తోటి,
తెల్ల వేప పూత, చింత, నిమ్మ వేసి,
కలిపి లవణముతో, కమ్మగ అందించ,
కలికి క్రొత్త వధువై వచ్చె ఉగాది. ||చిరు||

6.
కవి, గాయక, నృత్య, శిల్పి, వైతాళికులు,
భావములు పొంగగ, భాష రంగరించి,
నవ కవిత గానముకు, నటనలు కలుప,
హావ భావములతో వచ్చి ఉగాది.. ||చిరు||

7.
సాటి లేని మేటి దైవ శిఖామణి ,
ఏడు కొండల స్వామి వేంకటేశ్వరుడు,
పాటవము చూపి ప్రార్ధనలు వినుచూ,
దీటుగ దీవించ వచ్చె ఉగాది. ||చిరు||

రమాకాంతరావు చాకలకొండ

అజులు = బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు

ChirulathaPallava

Welcome Home

పల్లవి.
అలమేలు వస్తావా, అప్పడము వేస్తావా,
ఆకలి నాకు దంచేస్తున్నదే. ||అలమేలు||

అనుపల్లవి.
వడియాల పులుసు ఊరిస్తు ఉంది,
బిడియాలు మాని లాగించ మంది,
వడి వడిగ వడ్డించ వాలవే. ||అలమేలు||

1.
చింత చిగురు పప్పు, చేతి కంద కుంది,
కంది పచ్చడి గిన్నే కడు దూర ముంది,
కాకర కాయ కూర కను గీటు చుంది,
ఇంతి, సుందరి, ఇంపుగ వడ్డించే. ||అలమేలు||

2.
నీ చేతి పప్పు వూరిస్తు ఉంది,
నీ చేతి కూర లాలిస్తు ఉంది,
నెల క్రితపు పులుసు ఫ్రిజ్ లోనే ఉంది,
మైక్రో వేవ్ నిన్ను వేడి చేయ మంది. ||అలమేలు||

3.
ఫ్రిజ్ లోని అన్నం, దయ జూప మంది, డీ
ఫ్రీజ్ యందు పచ్చడి ఉంది,
నాజూకు నీ చేయి జాచవే,
త్వర త్వరగ వడ్డించ చేరవే . ||అలమేలు||

రమాకాంతరావు చాకలకొండ శనివారం

SFeb232013_AlameluVastava
SongAliameluVastava