Category Archives: Songs

Prabhodha Geetham – Vuti Yekka Lenivadu

పల్లవి. ఉట్టి ఎక్కలేని వాడు, వైకుంఠము ఎక్కునా?
పట్టు దల లేని వాడు, పరమార్ధము పొందునా? ||ఉట్టి||

అనుపల్లవి. ఒట్టి ఆలోచనలు విజయములు తెచ్చునా?
కష్ట పడక కూర్చున్న, కార్యము సిద్ధించునా? ||ఉట్టి||

1. నారు పోసి, నీరు పోసి వ్యవసాయము చేయకున్న,
వరి పంట పండునా? మన కడుపు నిండునా?
గురి పెట్టి వదల కున్నా, గొప్ప అణు బాణ మైనా,
వైరి గుండె చీల్చునా, విజయము కొని తెచ్చునా? ||ఉట్టి||

2. ఆలోచన ఉన్నంతనే ఐస్వర్యము దొరకునా?
తలపులు ఉన్నతమైనా, గెలుపులు సిద్ధించునా?
కలసి కట్టు కృషి చేయక, కొండ కూల్చగలనా?
నిలిచి ఎదురు పోరాడక, విజయము సాధించ గలనా? ||ఉట్టి||

3. గంధర్వులు వచ్చి మన కార్యములు చేతురా?
ముందు మనము నిలువ కున్న, పనులంటూ సాగునా,
అందరిని కలుపు కొననక, ఆదర్శము నిలుచునా
పొందిన ఏ పదవులైన, పదికాలము లుండునా. ||ఉట్టి||

4. చిన్ని కృషి చేయకనే, ఘన విజయం దొరకునా,
చిన్ని మొక్క పెరుగకే , ఫల వృక్షమై ఎదుగునా?
పని విలువ తెలియ కున్న, ఫలితము సిద్ధించునా?
మానవ కృషి జరుగు కున్న, మనుగడ యిక సాగునా? ||ఉట్టి||

రమాకాంతరావు చాకలకొండ సోమవారం, 27 మే 2013

Dear Friends,

This song attached Prabhoda Geethamu.

Having high thoughts is not enough, just by thinking only, nothing gets materialized. Good thoughts have to be converted to actions, hard work, then achievement is at your door step. If you want to eat paddy rice, one of us have to go to field, seed, water and cultivate, then only our stomach will be full. Even if it is a sharp arrow, it has to be carefully aimed at the enemy, then only you can defeat him. Same thing is true for your ambition. Having high ambition is good, but you have to work hard to win that. Success is the main product of hard work. Sometimes we have to work by ourselves, sometimes we have to make a group effort. We cannot blast a hill individually, at that time we require a group effort. We should stand together and boldly fight against difficulties against odds, to win success.

There is a proverb in Telugu “కాగల కార్యము గంధర్వులే తీర్తురు”, means some celestial people will come and work for your success. In practical life that is not true. You have to work for your success. Nobody is going to achieve success for you, even if your employees. You have to stand in the forefront, lead them, and then only you can achieve your target. The main character of a successful leader is to keep unity of his group, lead them with objectives. Otherwise winning positions and fruits of success is impossible.

With small efforts only great success knocks your door. If you plant a small fruit tree, that grows, and gives your fruit. All your millions are hidden in your hard work/ Things you think impossible on earth, become possible by dedicated, object oriented hard work. Remember what Bhartuhari said –

ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయస సంత్రుస్తులై
ఆరంభించిబరిత్యజింతుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్న నిహస్య మానులగుచున్ థృత్యున్నతోత్తాహులై
ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్.

తాత్పర్యం :
ఆంటకాలకు భయపడి నీచులు ఎలాంటి కార్యాన్ని మొదలుపెట్టలేరు. కార్యాన్ని మొదలుపెట్టి, విఘ్నాలు కలిగితే వదలిపెట్టేవారు మధ్యములు. ధీరులు, తెలివిగలవారు మాత్రం ఎన్ని విఘ్నాలు కలిగినా ధైర్యంతో.. గొప్ప ప్రయత్నం చేసి మొదలుపెట్టిన దానిని వదలకుండా పూర్తి చేస్తారు.

Friends, make your life happy filling all these good qualities, GOD is with you.

Best wishes,
Ramakanth

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


Download (PDF, 80KB)

Prabhodha Geetham – Chikula mayame

పల్లవి.
చిక్కుల మయమీ జీవిత మార్గము,
చక్కగ మల్చుక సాగాలి. ||చిక్కుల||

అనుపల్లవి.
నిగ్గగు ధైర్యము నిరతము నిండుగ,
నెగ్గను గుండెకు కావాలి. ||చిక్కుల||

1.
గెలుపు ఓటమిల గజి బిజి యాటే,
యిలలో బ్రతుకని ఎఱగాలి,
తెలిసి తెలియక చేసిన తప్పులు,
తెలివిగ దిద్దుక పోవాలి. ||చిక్కుల||

2.
కష్ట, నష్టములు కలిసి వచ్చిన,
నిష్ఠగ ముందుకు దూకాలి,
దుష్టు లెందరో దారిని యడ్డిన,
పుష్టగు శౌర్యము చూపాలి. ||చిక్కుల||

3.
పట్టుదల, పని సామర్ధ్యములే,
గట్టిగ గుండెన నిండాలి,
దిట్టదనంతో ధీరత వీడక,
పట్టిన పట్టుతో నిలవాలి. ||చిక్కుల||

4.
నిరాశ, నిస్పృహ నిర్వీర్యాన్ని,
నరికి పోగులు పెట్టాలి,
వీరుడవై, రణ శూరుడవై,
కర్తవ్య దృష్టితో సాగాలి. ||చిక్కుల||

5.
అలుపు, అలత ఆవాల పెట్టి,
నిలిచి ముందుకు నడవాలి,
గెలుపు ఒక్కటే గమ్యము గెంచి, మెరు
పులా ముందుకు ఉరకాలి. ||చిక్కుల||

రమాకాంతరావు చాకలకొండ శనివారం, 25 మే 2013

Dear Friends,

This song attached Prabhoda Geethamu. Life is not a bed of roses. There are so many thorns in the life’s path. Difficulties are part of the life, we have to encounter all kinds of people in our day to day life. We have to set our life’s objective and march forward to reach our target, with unshaken determination. Defeat and success are part of the story that is what life’s game is. Sometimes we also do mistakes knowingly and unknowingly. At the times of difficulties we should not lose heart, we should get double strong, and march forward with double confidence and strength to achieve our goal. Determination and efficiency are the two things to achieve success, hard work and determination are the only things required to win and be successfully in life. We should not allow depression, pessimism, lack of confidence come near us. We should kill these bad thoughts that may come in the mind. We should only aim at success. We should not get tired, get upset for anything, we should aim at our objective and march forward like a lightening.

Friends, make your life happy filling all these good qualities, GOD is with you.

Best wishes,
Ramakanth

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


Download (PDF, 29KB)

Yevari Vayya Sai Neevu

పల్లవి.
ఎవరి వయ్యా సాయి నీవు?
ఎవరు తల్లీ, తండ్రులు? ||ఎవరి||

అనుపల్లవి.
ఏది కులము? ఏది మతము?
ఏది వంశ, గోత్రము? ||ఎవరి||

1.
ఏది ఊరు? ఏమి పేరు?
ఏది ప్రవర తెలుపుము,
ఏది శాఖ, ఏది వర్ణము,
ఏది జన్మ స్థానము? ||ఎవరి||

2.
ఏది వృత్తి, ఏమి భృత్తి,
ఏది నీ వ్యాపారము?
ఏది రీతి, ఏది నీతి,
ఏది వివరము తెలుపుము? ||ఎవరి||

3.
ఏమి కార్యము చేయ బూనక,
భూమిపైకి వస్తివి?
ఏమి దాచక తెలుప మయ్యా,
స్వామి సద్గురు సాయినాధ్! ||ఎవరి||

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Yemani Telupani Jeevitham

పల్లవి.
ఏమని తెలుపనీ జీవితం,
ఆమని వీడిన పూవనం. ||ఏమని||

అనుపల్లవి.
మాంద్యము ముసిరిన తేజము,
సంధ్యలో కృంగు రవి బింబము. ||ఏమని||

1.
రెక్కలు లేని విహంగము,
రెక్కలు విరిగిన కుసుమము,
దిక్కులు ఎరుగని గమ్యము,
ముక్కలై మిగిలిన మానసం. ||ఏమని||

2.
పరిమళము లేని పుష్పము,
పరుగులు లేని ప్రవాహము,
విరిగిన పాల సమానము,
తీరు తెన్ను లేక సాగు జీవితం. ||ఏమని||

3.
గంధము మరచిన భ్రమరము, ఆ
నందము ఎరుగని మానసం,
బంధమై మిగిలిన విషాదము,
ఎందుకు కాని యీ వ్యర్ధము. ||ఏమని||

4.
వాడిన విరిగిన శాఖము,
ఎడారిలా మిగిలిన శేషము,
పడవ ఖండముపై ప్రయాణము, ఎ
క్కడికో ఒంటరి యానము. ||ఏమని||

5.
నవ్వులు లేని నిరాశయై,
పువ్వులు లేని పూతోటయై,
రివ్వున ఎగరని భావమై,
సవ్వడి లేని మురళి గానము. ||ఏమని||

6.
మోసులు వేయని మానసం,
కోసులు గడచిన పయనము,
ఆశలు వీడిన హృదయము,
శ్రీశుని పదముకే అంకితం. ||ఏమని||

రమాకాంతరావు చాకలకొండ గురువారం, జనవరి 10, 2013

Yemani Telupani Jeevitham MP3

Yemani Telupani Jeevitham PDF

subhamu subhamu subhamu – Happy new year 2013

Dear Friend,

happy new year. See attachment and voice recording of our best wishes.

పల్లవి.
శుభము, శుభము, శుభము శ్రీహరి భక్తులకు,
శుభము మీ సంతతికి, శ్రేయోభి లాషులకు. ||శుభము||

అనుపల్లవి.
నభ శ్యాము డందించ, నిత్య సంతోషములు,
విభవ, విద్య, విత్త, వేంకటాద్రి కృపలు. ||శుభము||

1.
సంతోషము మీ గృహమున నిండి,
సంతానము తోటి సౌఖ్యములు పండ,
బంధు మిత్రులతో, భాగ్యములు చేకూరి, హాయి
గుందురు గాక వేంకటేశుని దయతో ||శుభము||

2.
ఆరోగ్యము మీ యందరిలో నిండ,
సిరులు, సంపదలు, సమృద్ధిగ పండ,
శారదాంబ కృపలు సంపూర్తిగ నిండి,
తిరుమలేశుని కృపతో తఱలుదురు గావుత. ||శుభము||

3.
మానస వ్యధలు ముగిసి పోవును గాక,
సన్మాన, శ్రేయములు సంప్రాప్త మగు గాక,
అన్ని సౌభాగ్యములు సమకూరు గావుత,
అనతివ్వగ మాకు అలమేలు వల్లభుడు. ||శుభము||

రమాకాంతరావు చాకలకొండ సోమవారం, 31 డిసెంబర్ 2012

Regards,

Ramakanth and Family

Subhamu Subhamu Subhamu – PDF
Subhamu Subhamu Subhamu – Mp3

Thanks giving to Satya Sai Baba – on his birth day

పల్లవి.
సర్వ దేవతల సంకలిత తేజమే,
ఉర్విపై శ్రీకర సాయి స్వరూపము. ||సర్వ||

అనుపల్లవి.
సకల సద్గుణముల సంగత భావమే,
సూక్తి ప్రద శ్రీసాయి బోధనల సారము . ||సర్వ||

1.
ఉరగ సాయి హరి ఊర్జిత రూపము,
ఉరగ హారి హరుని ఊర్మి స్వరూపము,
ధారణి బ్రహ్మ దివ్య స్వరూపము,
పర్తి వాసుని దివ్య పరమార్ధ రూపము. ||సర్వ||

2.
సత్య, ధర్మ, శాంతి, ప్రేమల పాయసమే,
సత్య సాయి మనకు యిచ్చిన బోధనము,
నిత్యము మనల బ్రతికించు అమృతమే,
అతి దివ్య మకరంద సాయి మత సారము. ||సర్వ||

3.
కన్నుల పండువుగ కను ముందు యున్న,
కనుల ముందా రూపు కనబడ కున్నా,
మనములో మన ముందు నిత్యము మెదలు ,
ఙ్ఞాన తేజమే సాయి సత్య స్వరూపము. ||సర్వ||

రమాకాంతరావు చాకలకొండ శుక్రవారం, 23 నవంబర్ 2012

ఊర్మి = ప్రకాశము

evaro vaaru kaaru

పల్లవి.
ఎవరో వారు కారు, పరువాల మరదలే వారు,
సరదాగ నా హృదయము నేలే, సరసిజ కోమలి వారు.. ||గంధము||

అనుపల్లవి.
పల్లవిగ నా హృదయ వీణపై,
చల్లగ పలికెడి వారు ||గంధము||

1.
సంగీత సరిగమ వారు,
మంగాంబ పేరు గల వారు,
నింగి రంగు నా ఎద శృంగముపై,
మంగళ రూపము వారు. ||గంధము||

2.
సన్నని కంఠము వారు,
నును సన్నని మేను వారు,
సన్నని ప్రేమ మత్తును చిలికి,
కన్నులు కలిపిన వారు. ||గంధము||

3.
తెల్లని తనువు వారు,
మల్లెల మేను వారు,
చల్లని చూపుతో సరసన చేరి,
వలపులు విసిరెడి వారు. ||గంధము|

4.
సువర్ణ శోభల వారు,
భువి లోనే సుందరి వారు,
కవ్వించి, నను కవిలా చేసి,
కవితలు వినెడి వారు. ||గంధము||

5.
కలరవ కంఠము వారు, నా
కలలో కన్నిక వారు,
ఇలలో మంగ పురమున వెలసిన,
అలమేల్ మంగే వారు. ||గంధము||

6.
మరు మల్లె గంధపు వారు,
పరువాల జల్లులే వారు,
తిరు వేంకటగిరి రాణిగ నాతో,
వరములు కురిపెడి వారు. ||గంధము||

రమాకాంతరావు చాకలకొండ సోమవారం, 29 అక్టోబర్ 2012

gandhamu tiyave gopamma

పల్లవి.
గంధము తీయవే గోపమ్మా, గో
విందుని కొలువుకు ఓ యమ్మా! ||గంధము||

అనుపల్లవి.
నంద నందనుని నామము పల్కుచు, ఆ
నందము నొందవే ఓయమ్మా! ||గంధము||

1.
కులుకులు కులుకుచు, కిల కిల నవ్వుచు,
కల కల గాజులు సవ్వడి చేయుచు,
కలికి యశోద కొమరుని కొల్వరే,
నెలతలు నవ్వుచు ఓయమ్మా! ||గంధము||

2.
వలపుతో గంధపు మాలలు యల్లుచు,
తలపుల లోన హరిని తలంచుచు,
అలకల కొలికి అలమేల్ పతికి,
కొలువులు చేయరే ఓయమ్మా! ||గంధము||

3.
కలికి దనపు ఒయ్యారము జూపుచు,
తళ తళ లాడే మేనితో తఱలుచు,
చిలకల కొలుకులు కల కంఠముతో,
చలపతి యనరే ఓయమ్మా! ||గంధము||

రమాకాంతరావు చాకలకొండ ఆదివారం, 28 అక్టోబర్ 2012

Song on 11th the birth day of Lord sri Venkateswra

పల్లవి.
పుట్టుకే లేని పరమ పురుషునికి,
పుట్టిన రోజు పండుగ పాటా? ||పట్టుకే||

అనుపల్లవి.
జనన మరణము లేని జగన్నాధునికి,
జన్మ దిన సంబర జయ జయ గీతా?. ||పట్టుకే||

1.
యిటు నటు లేని వేంకటేశునికి,
పడగ టుయ్యాలలో ప్రేమతో పాటా?
పటుతర ప్రభల పరమ ప్రకాశునిపై ,
ఎటుల పాడుటయో ఇంపైన పాట?. ||పట్టుకే||

2.
పుట్టలో చీమలై పుట్టి, గిట్టెడి నరులు,
పుట్టువడుగు పైన పాడెడి పాటా?
పుట్టు చక్రములోన పాట్నెన్నో పడువారు,
ఎట్టి కేలకు హరి పై ఎలుగెత్తి పాటా? ||పట్టుకే||

3.
తల్లి తండ్రి లేని తత్వ స్వరూపునికి,
ఇలకు విచ్చేయగ ఇమ్మగా పాటా ?
కలిన శేషాద్రిపై వేలసిన స్వామికి,
కలలోన జారుటకు కమ్మని పాట. ||పట్టుకే||

4.
శ్రావణ నక్షత్ర శుభ ఘడియ లందు,
రవి శశి నయనునిపై రమ్యమగు పాట,
భువికి శేషాద్రిపై వచ్చిన ఘడియందు,
అవిరళ ప్రేమతో అమ్మ జోల పాట. ||పట్టుకే||

రమాకాంతరావు చాకలకొండ గురువారం, 11 అక్టోబర్ 2012

Putukeleni