Category Archives: Songs

Andhra Song

పల్లవి. ఆంధ్రావనికి వందనము, అమృత కలశకు వందనము,
సుందర ధాత్రికి వందనము, సశ్య శ్యామకు వందనము. ||ఆంధ్రా||

అనుపల్లవి. అనునయ శీల, అనుపమ శోభ, అన్నపూర్ణకు వందనము
సునిసిత ఙ్ఞాన, శుభ గుణ సోన, సీమాంధ్ర మాతకు వందనము. ||ఆంధ్రా||

1. రాయలేలిన బంగరు భూమి సింగారములకు వందనము, న
న్నయ, తిక్కన, ఎఱ్రాప్రగడల కన్న తల్లికి వందనము. ||ఆంధ్రా||

2. విజయవాడ, నెల్లూరు తిరుమల, సుందర సీమకు వందనము,
విజయ, విశాఖ, కాకినాడ – సువిశాల భూమికి వందనము. ||ఆంధ్రా||

3. రవి తేజులు, అల్లూరి, రాముల, వీర మాతకు వందనము,
వావిలాల, కాశీ, కేసరుల వనజ గర్భకు వందనము. ||ఆంధ్రా||

4. మంగళగిరి, సింహాచల క్షేత్ర, అన్నవరాలకు వందనము, త్రి
లింగ క్షేత్ర, దుర్గామందిర, తిరుమల ధాత్రికి వందనము. ||ఆంధ్రా||

5. త్యాగరాజ, క్షేత్రయ, వేమనల మాతృమూర్తికి వందనము,
యోగి బ్రహ్మము, అన్నమయ్యల, అమ్మకు భక్తిగ వందనము. ||ఆంధ్రా||

6. వీణామృత, మధుగాన, గమక ప్రియ, నాట్య వినోదకు వందనము,
వాణి సుత, వైతాళిక, వీరుల వన్నెల తల్లికి, వందనము. ||ఆంధ్రా||

7. శ్రామిక, కార్మిక, హాలిక జీవుల సన్నుత సురభికి వందనము,
విశ్వములో ప్రతి లేని ప్రగతి గల, నవ సీమాంధ్రకు వందనము.. ||ఆంధ్రా||

రమాకాంతరావు చాకలకొండ గురువారం, 03 జూలై 2014

Download (PDF, 49KB)

పప్పు –మహత్యం

పల్లవి. అప్పడం, అన్నము, పప్పు , నెయ్యి కలిపిన,
చెప్పలేని పని గదా చేతికి నోటికి. ||ముద్ద||

అనుపల్లవి. దప్పళం, వడియము, దప్పముగ కలసిన, (దప్పముగ = దట్టముగ, బాగుగ)
దబ దబ దబాయించ దివ్యము నోటికి. ||ముద్ద||

1. ముద్ద, ముద్ద చేతిలో ముద్దుగ కలుపుచూ,
వద్దు, వద్దు అనకుండ ఆవు నేయి అలముచూ, (అలముచూ = పూయుచూ)
దప్పికైన యించుక లెక్కచేయకుండిన,
జొప్పిం వచ్చులే యింక రెండు ముద్దలు. ||ముద్ద||

2. దోసకాయ, పాలకూర, చింత చిగురు పప్పులు,
ఆశ తీర్చు మామిడి టమాటో పప్పులు,
మోసులెత్తు మానసం, ముద్ద ముద్ద మెచ్చగా,
రాసిగ కలపరా రాసమే నీటికి. (రాసము = రసము, సల్లాపము) ||ముద్ద||

3. ఆవకాయ, మాగాయ, టమాటో పచ్చడి,
చేవగ కలిపిన చిత్రమెగా పప్పుతో,
బ్రేవుమని ప్రేవుల ఆరాటము తీర్చుచూ,
ఆవురావురు యనగ అందించు నోటికి. ||ముద్ద||

4. పప్పు తోటే భీముడు కొట్టాడు విజయము,
పప్పు తినే దమయంతి నచ్చిందట నలుని,
పప్పు యిచ్చు తెలివితో వచ్చులే కవితలు,
పప్పంటే అప్పడిగి అగు నెంతో యిష్టము. (అప్పడు = వేంకటేశుడు) ||ముద్ద||

రమాకాంతరావు చాకలకొండ గురువారం, 31 అక్టోబర్ 2013

Download (PDF, 48KB)

Birth day song on Swami Tridandi Chinna Jiyar Swami

Dear friends,

Jai Srimannarayana,

Please find attached song or see below and also listen to the attachment in MP3. This is Happy birthday song on Chinna Jiyar Swami.

Please visit the following websites for songs on Lord Srivenkataswra and subscribe to get 24 CD’s on Lord SriVenkataswra.

Visit: http://ramakantha.com /
http://lordbalajisongs.com/
Best regards.

Ramakantha Rao Chakalakonda

పల్లవి. వెలుగులు చిమ్మే విష్ణు ప్రభల తోటి,
ఇలపైకి అరుదెంచె యతిరాజ చంద్రుడు . ||వెలుగులు||

అనుపల్లవి. దీపావళి దివ్య పుణ్య తిధి నాడు,
అపురూప దీప్తులతో అవని కరుదెంచె . ||వెలుగులు||

1. అల్లారు ముద్దుల వేంకని తనుయుడిగ,
అలమేలు మంగమ్మ పుణ్య గర్భము నందు,
కలి కల్మష హర కేశవ మంత్రము,
ఎల్లరికి అందించు సూర్యు డుదయించె. ||వెలుగులు||

2. విఙ్ఞాన జ్యోతుల వైష్ణవము వెదజల్ల,
ప్రఙ్ఞాన చంద్రుడు పుడమికి వచ్చె,
అఙ్ఞాన తిమిరము అంత మొందించను,
సుఙ్ఞాన సారమే స్వామి రూపము నొచ్చే. ||వెలుగులు||

3. చిన్న జీయరులై చిరు నవ్వు నవ్వగ,
పున్నమిగ ఙ్ఞానము భూమిపై వచ్చె,
వెన్నుని కీర్తులు విశ్వముకు చాటుచూ,
ఎన్నెన్నో కార్యములు స్వామి ఒనరించె. ||వెలుగులు||

4. మంగమ్మ తనయుడా! మంగళాకారుడా!
గంగ జనకుని సుతుడా! ఙ్ఞాన ప్రదాతా!
వంగి నీ పదములకు వినయముగ మ్రొక్కేము,
మంగళా శాసనము మాకిమ్ము స్వామి. ||వెలుగులు||

రమాకాంతరావు చాకలకొండ. M.Sc, MA, M.Com, M.Tech, M.Tech(IT), MBA, MCA, M.Phil, PGDM, PG Dip IR&PM బుధవారం, 25 సెప్టెంబర్ 2013

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


Download (PDF, 53KB)

Swaramu Suswaramina

సంగీత ప్రియులకు శుభోదయం,

భగవంతుడు సృష్టిలోని ప్రాణులందరికి స్వరము యిచ్చాడు ప్రియోక్తులు పలుకను, తమ కున్న రాగ, బావాలను యితరులకు తెలియ జేయును. వేలలో కొందరికి శ్రావ్యమైన కంఠము యిచ్చాడు వేంకటేశ్వరుడు. యితరులను అలరించే సుమధుర కంఠము దేముడిచ్చున ఒక వరం. ఆ వరాన్ని సద్వినియోగము చేసుకొనే భాగ్యం కోట్లలో కొందరికే దక్కుతుంది.

శ్రీ శ్రీ శ్రీ అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు వంటి మహానుభావులకు, భగవంతుడు కవిత చేయు కౌశలము, స్వర కల్పన శక్తి, సంగీతము చేయు స్వరము యిచ్చాడు. అలాంటి వాగ్గేయ కారులను వేళ్ళ మీద లెక్కించ వచ్చు. ఆ కళ లన్నీ మనకు దక్కక పోయిన, మన యందరికి ఎదో ఒక శక్తిని యిచ్చాడు. అదే సంగీంత వినే శక్తి. సృష్ఠిలో ప్రతి ప్రాణికి సంగీతం ప్రియమే. భగవంతుడు మీకు సంగీతం పలికించే అద్భుత శక్తి నిచ్చాడు, దాన్ని సమస్త మానవాళికి ఉపయోగించే విధంగ భగవంతుని సేవకు వినియోగించండి.

రమాకాంతరావు చాకలకొండ ( Cincinnati, OH, USA)

పల్లవి. స్వరము సుస్వర మైన సంగీతమే!
వరముగ దొరకగ శ్రావ్యమగు కంఠము! ||స్వరము||

అనుపల్లవి. హరి కీర్తన యందు హృద్యముగ పొంగిన,
ఔర! యది గాదే వినువారి భాగ్యము. ||స్వరము||

1. ఇల లోన యందరికి కంఠములు యున్నా,
కల రవము వంటి కమ్మని కంఠముతో,
ఆలాపన చేసి అలరించు వరము,
వేలలో కొందరికే దొరకెడి భాగ్యము. ||స్వరము||

2. మాధుర్య వీణయై మాటలు వెలువడ,
శ్రోతల ఎదలోన అమృతము నిండగ,
సుధ లొలుకు సుమధుర స్వరములు చేసెడి,
మాధవ కీర్తనే మహిలోన భాగ్యము. ||స్వరము||

3. మురళి గానముతో మధురముగ కలిసి,
పరవశము నొందుచూ పరవళ్ళు తొక్కగ,
తిరువేంకటేశుని తత్వము పాడెడి,
స్వరము అరుదుగ దొరకు మహభాగ్యము. ||స్వరము||

రమాకాంతరావు చాకలకొండ సోమవారం, 07 అక్టోబర్ 2013

Download (PDF, 38KB)

Swami Swarupa

Good morning – See you in Novi Sri Venkataswra temple today.

పల్లవి.
స్వామి స్వరూప సంవిత్తి నిచ్చిన,
రామానుజ స్వామి ఋణగ్రస్తులము. ||స్వామి||

అనుపల్లవి.
తిరువేంకటేశుని తత్వము తెలిపిన,
ఆళ్వారులందరికి ఆత్మ వందనము! ||స్వామి||

1.
నారాయణ నుతి విధులను తెలిపిన,
నారద స్వామికి నిత్య వందనము,
శౌరి సంసేవన సంపూర్తి తెలిపిన,
గురులు వైష్ణవులకు గరిమ వందనము. ||స్వామి||

2.
భాగవత చరితను జగతి కందించిన,
నిగమ గురు వ్యాసునికి నమ్ర వందనము,
జగత్ విఖ్యాత భక్త పోతన్నకు,
తగు రీతి శ్రద్ధతో శిరో వందనము. ||స్వామి||

3.
శ్రీధరుని సేవించు మార్గము తెలిపిన,
పెద్ద జీయరుకు పాద వందనము,
నిద్ర ముణిగిన మాకు చైతన్య మిచ్చెడి,
వేది చిన జీయరుకుభక్తి వందనము. ||స్వామి||

4.
వెన్నుని కీర్తి గానము చేసిన,
అన్నమయ్యలకు అమల వందనము,
ఎన్నెన్నో రీతుల ఏడు కొండల వాని,
సన్నతించెడి మనకు స్వీయ వందనము. ||స్వామి||

రమాకాంతరావు చాకలకొండ ఆదివారం, 02 జూన్ 2013

Download (PDF, 25KB)

Prabhodha Geetham – Nirasa Nispruha

పల్లవి.
నిరాశ, నిస్పృహ నిండిన కన్నులతో,
ధైర్యము బాసిన దమన యువతా! ||నిరాశ||

అనుపల్లవి.
కలదు నీ కను ముందు భావి భవితవ్యము,
అలత వీడి కదిలి అందుకో విజయము. ||నిరాశ||

1.
నిద్ర మగతను వీడి, నులిపి కన్నులు చూడు,
అద్రి యంత ఘనత అదిగో నీ ముందు,
మది లోన ధైర్యపు మకరందము నింపి,
అతులిత సఫలత అమృతము నందుకో. ||నిరాశ||

2.
నూన్య భావము తోటి నలిగి సన్న బడకు,
మాన్యమగు ధీరత మది నిండ నింపుకో,
ఘన కీర్తి బడసెడి కార్యము నీకున్నది,
మౌన ముద్రను వీడి ముందుకు సాగిపో. ||నిరాశ||

3.
కార్య దీక్షత బూని కదులు మున్ముందుకు,
వీర వన్నెల జాతి భారతావని పౌర!
ధీరుడవై శూరుడవై కర్తవ్య బద్ధుడవై,
దొరికించు కొనుము విజయ పతాకము. ||నిరాశ||

రమాకాంతరావు చాకలకొండ శుక్రవారం, 31 మే 2013

Dear Friends,

This song attached Prabhoda Geethamu.

Hey Young man! With depression, and disappointment stuck youth, you lost self-confidence. Weak up, there is a bright future waiting for you, get rid of your worries and achieve the great success. Get rid of the laziness and open up. There is a future which of mountain size, grab it. Fill honey sweat boldness in your heart and achieve manna like success. Get rid of the feeling of emptiness in your heart, fill the great confidence in its place. You have the great task of achieving success waiting for you, leave your silence and jump into action. Start fresh with determination; you belong to the great Indian nation whose quality is boldness. Like a bold solider be action oriented and catch the flag of success and hoist it.

Dear Youth! Be bold and action oriented and achieve your objective of life, GOD is with you.

Best wishes,
Ramakanth

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


Download (PDF, 40KB)

Prabhodha Geetham – BantilaYeguravale

పల్లవి.
బంతిలా ఎగుర వలె పైకి పైకి,
ఎంత కిందికు కొట్ట అంతకంటే పైకి ||బంతిలా||

అనుపల్లవి.
చెండులా చూపవలె చురుకు దనము,
బెండులా వంగక భీతితో హృదయము. ||బంతిలా||

1.
ముద్దల ఒక మూల పడి యున్న బంతికి,
మొద్దులా పని చేయక కూర్చున్న వానికి,
వదలని దుమ్మోకటే ఒళ్ళంతా పట్టును,
లేదు రాదు వారికి ప్రగతి, పదవి, ఖ్యాతి. ||బంతిలా||

2.
దెబ్బలకు భీతిల్లిన బంతి పైకెగయునా?
నిప్పులకు భయపడిన బంగరు నగ యగునా?
నొప్పులకు వోర్వకున్న ఇనుము పలుగగునా ?
తప్పులకు జడసిన తఱలు కీర్తి దొరకునా? ||బంతిలా||

3.
పని చేయు వారికే పదవి, భాద్యత, భారము,
పని చేయు వారికే పట్టు వైభోగము,
పని విముఖుడు ప్రగతి లేని పెద్ద రాయి సమము,
పని లోనే ఉన్నది పరమానందము. ||బంతిలా||

రమాకాంతరావు చాకలకొండ మంగళవారం, 28 మే 2013

Friends,

This song attached Prabhoda Geethamu.

We should bounce like a ball, the more you are pushed down, to the more higher heights. We should show the sharpness of a ball in our movement, we should not get broken out of fear, for small difficulties. The one who sits like a mud ball in a corner or a ball unused lying in a corner, only accumulate dust, there is no progress for them. If balls is worried about kicks, how it can rise to top? If gold is worried about fire, how it can become an ornament? If iron is worried of strikes how it can get sharpen like an weapon? If you are worried that you may make mistakes, how you can you can win success? Those who work will get famous, position and responsibility, they only get wealth. The person who does not work is like a big unused stone. Only in work you can derive pleasure.

Friends, make your life happy filling all these good qualities, GOD is with you.

Best wishes – Ramakanth

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

PDF:

Download (PDF, 42KB)