Category Archives: Poetry

వెక్కిరించకు వినక ఒక పరి శ్రద్ధగా

Dear Friends,

Good morning. Now a days it became a fashion for some people, to make adverse comments, without going though even once, the contents of our great works like Nigama, Purana Traya, and wealth of literature; on our religion, religious books, Swamiji’s and their sayings. Before doing that they should read, understand and make comments. That is called constructive criticism. For those this is my advise.

పల్లవి. వెక్కిరించకు వినక ఒక పరి శ్రద్ధగా,
వెక్కసపు భారత, భాగవత చరితలు. ||వెక్కిరించకు||

అనుపల్లవి. నిక్కము ఎఱుగక, నిగమ రహస్యములు,
మొక్కుబడి కైన వినక రామాయణము. ||వెక్కిరించకు||

1. యిందులో నీతులు, యిందులో శాస్త్రములు,
పొందైన ఙ్ఞాన సంపద యుండగ,
ఎందుకు చేసెదవు వ్యర్ధ విమర్శలు ,
యిందులో ఉన్న విఙ్ఞాన మెఱుగక. ||వెక్కిరించకు||

2. జీవన మార్గము చక్కగ తెలపెడి,
అవిరళ సుఙ్ఞాన మార్గము నేర్పెడి,
భువిలోన బ్రతుకు సుగమము చేసెడి,
కవి చేతల మధుర సారము నేర్వక. ||వెక్కిరించకు||

3. వ్యక్తి, సంఘము, జాతి నీతులు తెలిపెడి,
చక్కని ఙ్ఞాన సుధ యిక్కడే ఉండ,
ఎక్క డెక్కడో వెతకి వ్యర్ధమై పోయెదవు,
నిక్కమగు సత్యము చక్కగ నేర్వక. ||వెక్కిరించకు||

4. కర్తవ్య దీక్షలో కార్య సాధన విధులు,
సర్వ మానవ సేవ, సమ భావ బోధలు,
చరమ శాంతికి వలయు జీవన పద్ధతులు,
సర్వము నేర్పెడి గ్రంధములు చదువక. ||వెక్కిరించకు||

రమాకాంతరావు చాకల కొండ ఆదివారం, 20 అక్టోబర్ 2013

Santasamu

పల్లవి. సంతసము సమకూర్చు సామగానం,
సంతృప్తి నిచ్చును సామగానం! ||సంత||

అనుపల్లవి. సంతాపము తీర్చు సామగానం,
సంతతము శుభకరము సామగానం! ||సంత|| సంతతము = నిత్యము, ఎల్లప్పుడు

1. మది ఆర్తి తీర్చును సామగానం,
ముదము కలిగించును సామగానం,
వ్యాధులకు ఔషధము సామగానం,
మాధవ ప్రియము సామగానం. ||సంత||
2. శక్తిని కలిగించు సామగానం,=,
ముక్తి మార్గము తెలుపు సామగానం,
భక్తిని కలిగించు సామగానం,
రక్తిగ ఎంచుము సామగానం. ||సంత||

3. వెతలు తొలగించును సామగానం,
ఎద బరువు తీర్చును సామగానం,
బ్రతుకు బాటను జూపు సామగానం,
నిత్యము చేయుము సామగానం. ||సంత||

4. కర్తవ్యము గరుపు సామగానం,
ఆర్తి అగ్నికి జలము సామగానం,
ఆరాధన పథము సామగానం,
హరి ప్రియ మార్గము సామగానం. ||సంత||

5. కన్నీరు తుడుచును సామగానం,=,
మానవత్యము నేర్పు సామగానం,
వెన్నుడు మెచ్చెడి సామగానం,
ఎన్ను కొనుము నేరి సామగానం. ||సంత||

రమాకాంతరావు చాకలకొండ ఆదివారం, 06 అక్టోబర్ 2013

Download (PDF, 35KB)

Fury of natural elements

Dear Friends,

How are you.

You would have heard the devastating tornado in Oklahoma.

Now a days we are seeing the fury of natural elements, in terms of Tsunami, tornado’s, wild fires, earth quakes, blowing heat etc. The man who thinks he is the most powerful in the creation, had to helplessly watch the blow? What is the solution for this?

పల్లవి.
ఏమి యీ ప్రకృతి వైపరీత్యములు?
భూమిపై జరిగెడి భీకర కృత్యములు! ||ఏమి||

అనుపల్లవి.
ప్రాణములు నిలిపెడి పంచ భూతములే,
ప్రాణములు తీయునా ? ఏమి యీ చోద్యము ? ||ఏమి||

1.
ఊపిరిచ్చెడి గాలే ఓపిక వీడి,
తాప ప్రభంజనమై తుఫాను రేపునా?
అపురూప చంద్ర ప్రభ ఆకాశ పథమే,
నిప్పులు చెరగుచూ నిర్ధయ జూపునా? ||ఏమి||

2.
దాహములు తీర్చెడి తియ్యని జలములే,
అహంకార జలధై ఆక్రోశము జూపా?
స్నేహభావము వీడి శుద్ధి చేసెడి అగ్ని,
ద్రోహము చేయునా దగ్ధ జ్వాలగ మారి? ||ఏమి||

3.
అన్నము, నీడ అందించు అవనియే,
ఖిన్నత జూపి కంపించి కూల్చునా?
ఎన్నేనో శక్తులతో విఱ్ఱవీగెడి నరుడు,
వీని ముందు ఓడి తలవంచు కొనునా? ||ఏమి||

4.
ప్రకృతి నిమ్మళ నైజము విడనాడి,
వికృతాకృతిలో విషాదము నింప,
సకల, సృష్ఠి, స్థితి, లయ కారకుండైన,
శ్రీకరుడు వేంకని శరణమే దిక్కు. ||ఏమి||

రమాకాంతరావు చాకలకొండ బుధవారం, 22 మే 2013

Chandanotyavamu

చందనోత్యవం

ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో నరసింహక్షేత్రాలు ఉన్నాయి. వీనిలో సింహాచల నరసింహస్వామ, మంగళగిరి పానకాల నరసింహస్వామి, యాదగిరి నరసింహస్వామి, పెంచల కోన పెనుశిల నరసింహస్వామ,, అహోబిళ నరసింహ స్వామి దేవాళయాలు ప్రధానమైనవి. సింహాచలం దక్షిణ భారతదేశం లోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకట. స్థలపురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా నరసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది; మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో. బడి ఉంటుంది. యీ
సమయాన్ని చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుద్ద తదియ నాడు అనగా మే నెలలో వస్తుంది.

యీ సుదినం యీ రోజే. యీవేళ సుప్రభాత సేవతో స్వామి మేల్కొలుపు చేసి, విష్వక్సేన, పుణ్హవచనం పూజలు చేస్తారు. అనంతరం వేదమంత్రాలు, నాద స్వర మంగళ వాయిద్యాల నడుమ వైదిక వర్గాలు వెండి బొదిగెలతో స్వామి దేహంపై నున్న చందనాన్ని తొలగిస్తారు. పిదప అభిషేకం, ఆరాదనల అనంతరం, స్వామి శిరము, ఎదపై పచ్చి చందనం ఉంచి నిజరూపం లోకి తీసుకొని వస్తారు. దినమంతా నిజరూప దర్శన మనంతరం, స్వామికి పంచామృతాలసతో పట్టాభిషేకం చేస్తారు.

పల్లవి.
చందనము పూసెదమున చక్రి నీ తనువుకు,
ఇందిరమ్మను తెచ్చి పెండ్లి చేసెదము . ||చందనము||

అనుపల్లవి.
మందార మాలలు మెడన వేసెదము,
సుందరముగ నీ సొగసు దిద్దెదము. ||చందనము||

1.
సుప్రభాతము తోటి స్వస్తి వచనము పలికి,
ఆపై – విష్వక్సేస సేవ గావించి, పి
దప పుణ్యహవచన పూజను చేసి,
శ్రీపతి యీదినము నిన్ను గొల్చెదము. ||చందనము||

2.
వేద మంత్రములు విను వీధి నంటగ,
నాద గణములు నీ నుతులను చేయగ,
నాదస్వరము అతి రమ్యముగ పల్కగ
మాధవ నీ సేవ మొదలు పెట్టెదము. ||చందనము||

3.
వైదిక గణములు వెండి బొరిగల తోటి,
నీదు దేహముపై చందనము తొల్చగ, పి
దప అభిషేకము, ఆరాధన చేసి,
ఎదపై, శిరముపై మరల చందనము ఉంచెదము. ||చందనము||

4.
రోజంత సుజనలు నిజ రూపము జూచి,
వేచిన క్షణములు వరములై ఫలమీయ,
సుచిగ పంచామృత సేవలు గావించి,
పూజ్య! చేసెదము పట్టాభి షేకము. ||చందనము||

5.
నిజ రూప దర్శనము కను విందు చేయగ,
ద్విజులందరు మ్రొక్కి స్తోత్రములు చేయగ,
సుజనులు నిను జూచి సంతసము చెందగ,
అజిత! నీ పదముకు అర్చనలు చేసెదము. ||చందనము||

రమాకాంతరావు చాకలకొండ

Download (PDF, 111KB)

Failures are the stepping stones to success

Dear Friends,

Life is a cycle of success and failures, we get one after the other. We should not get depressed when misfortune encounters, take failure as a lesson and work with motivation and strength towards bigger success. Ball when falls down, raises much more heights, same thing with the wave. Boldness leads to a strong personality, who ultimately wins.

Happy Dasara,

Best wises

పల్లవి.
ఓటమికి వెఱచి ఆడుట మానకుము,
ఓటమే గెలుపు సుగమము చేయును. . ||గాఢ||

అనుపల్లవి.
ఎంత కిందకు పడునో, అంత పై కెగయును
బంతిని జూచి బుద్ది తెచ్చు కొనుము ||గాఢ||

1.
పడి లేచి బిడ్డ పరుగులు నేర్చును,
సుడులు తిరిగి అల పై పైకి ఎగయును,
పట్టు బట్టి ఆడి, ఓడి గెలుచుట లోనే
తుట్ట తుదకు దొరకు ఆనందము గనుము. ||గాఢ||

2.
సాలెడు గూడుకై ఎంతో శ్రమ పడును,
గాలి కొంగి కొమ్మ నిల దొక్కు కొనును,
కాలాణు గుణముగ మంచి, చెడు లున్ననూ,
ఫలితము చివరకు శ్రమ జీవికే దొరకు. ||గాఢ||

3.
ప్రేరణ, తపన, పట్టుదల యున్న,
ధరణిలో ఏదైనా సాధింప గలము,
పోరి సాధించిన పరమార్ధము దొరకు,
భీర భావముకు తావుండ రాదు? ||గాఢ||

రమాకాంతరావు చాకలకొండ గురువారం, 18 అక్టోబర్ 2012

Indian Flag – JatiGhanathanu

పల్లవి.
జాతి ఘనత దెలుపు జాతీయ జెండా, ప్ర
గతికి, రీతికి, ప్రతీకైన జెండా. ||జాతి||

అనుపల్లవి.
మూడు రంగుల వెలయు ముచ్చటైన జెండా,
నడుమ చక్రము గల నయగారపు జెండా! ||జాతి||

1.
ధీర స్వభావము చాటు కాషాయముతో,
వీర రస ప్రబోధ విద్యోత జెండా,
ధరణి మాతకై ప్రాణ త్యాగము చేసెడి,
శూరల దేశమని తెలుపు నీ జెండా! ||జాతి||

2.
శాంతి పధతమును జూపి, ధవళ
కాంతుల మెరయు, దేదీప్యమాన రంగుల జెండ,
ఎంత ఆపదనైన సత్యమే పల్కమని,
అందరికి తెలిపెడి అందమైన జెండా! ||జాతి||

3.
నమ్మకము తోటి నలుగురు చల్లగ,
ధర్మ పథము లోన సాగుమను జెండ,
సమానత్వము, మంచి, కరుణ స్వభావ,
సమ సమాజ ఉనికి తెలుపు మన జెండా. ||జాతి||

4.
అశోక చక్రము అందముగ మధ్యన,
దేశ ప్రగతిని చాటు దీపికై వెలుగగ,
శ్వాశ పీల్చుకొని న్యాయ, ధర్మము యిచట,
వాసముండేనని తెలుపు నీజెండా! ||జాతి||

రమాకాంతరావు చాకలకొండ మంగవారం, 14 ఆగస్టు 2012

SAug1420121_JatiGhanathanu

గురువులు తరువులై గరిమగ మన వలె

పల్లవి.
గురువులు తరువులై గరిమగ మన వలె,
బరువులై అందరిపై భువిన ఒఱుగ రాదు. ||గురువులు||

అనుపల్లవి.
నిరత సన్మార్గ శాంతి శుభ దాతలై,
దారిని జూపెడి దీప్తులై యుండ వలె. ||గురువులు||

గురుకర్తవ్యం:
1.
ప్రేమ, భక్తి, కరుణ, ప్రతి ఎదన నింపుచూ,
తామసము తొలగించు తత్వ బోధకులై,
కామ, క్రోధ, మోహ, కలుషములు తొలగించి,
నెమ్మిగ అందరికి నీతిని నేర్ప వలె. ||గురువులు||

2.
ఆసూయ, ద్వేషముల రూపును మాపి,
ఆశ యను రక్కసిని అంతము చేయ వలె,
మోస రాజకీయ సర్ప కోరలు తీసి,
దేశ భక్తిని ప్రతి గుండెన నింప వలె. ||గురువులు||

3.
జాగ్రుతి భావ శంఖమును పూరించి,
జగతి ప్రగతికి తమ చేయూత నీయ వలె,
రాగానురాగ మధు రసము త్రాగించి,
పగల మంటల నార్పు పెను మబ్బు కావలె. ||గురువులు||

4.
అర్ధ వ్యామోహ ఆతృతలు తగ్గించి,
స్వార్ధ బుద్ధిని వీడి సేవలు చేయ వలె,
అర్ధము లేని అహంకారము వీడి, పర
మార్ధ సాధనకు బావుటా నెత్త వలె. ` `||గురువులు||

గురు వర్తన:
5.
అహంకారముతో హంకరించుట మాని,
స్నేహ భావామృత చలివేంద్ర కావలె,
దేహ సుఖములకు దాసోహ మనక,
మోహము విడనాడి మనిషిగ నుండ వలె. ` `||గురువులు||

6.
పదవి, ప్రఖ్యాతుల పాకులాటలు మాని,
గద్దెపై కోర్కెను గుండెలో చంప వలె,
గతములో చేసిన తప్పులు దిద్దికోని,
పెద్దలపై గౌరవము పెంచుకొని మన వలె . ` `||గురువులు||

7.
విద్యలు ఉన్న వని విఱ్ఱ వీగి పోక,
హద్దులు ఎఱిగి వర్తన చేయ వలె ,
చేదు విషమును చిమ్ము చపలత్వము వీడి,
నిద్రను మేల్కొని నల్గురుని దిద్ద వలె. ` `||గురువులు||

8.
ఉరుములా ఉరుముచు ఉద్వేగము పడక,
చిరు నవ్వు చిందించు సద్బుద్ధి చూప వలె,
కరుణ, శాంతి, ప్రేమ ధర్మ గుణ మణిగ ,
గురువు ఒక ఆదర్శ వ్యక్తిగ నుండ వలె. `||గురువులు||

9.
ఙ్ఞాన ఫలముల నిచ్చు కల్ప వృక్షములా,
తన శిష్య కోటితో ఆచార్యుడుండ వలె,
సాన బట్టిన తన సద్గుణ దీప్తులతో ,
సన్మార్గ గామిగ గురువులు మన వలె. ` `||గురువులు||

10.
నీచ భావ నీచు వదనలమని చెప్పక,
ఆచరణతో తాను అందరికి చూప వలె,
త్రాచుల వంటి తన ఆరు గుణములు వీడి,
స్వఛ్చమగు ముత్యమై ఆచార్యు డుండవలె. `||గురువులు||

11.
గురువులకు గురువైన తిరుమలేశుని రూపై,
గురువు అతి ఘనమగు ఘన కీర్తి నొందవలె,
ఉర్విలో గురువులు ఉత్తము పురుషులై,
సర్వ జీవులకు శాంతిని పంచ వలె. ||గురువులు||

గరుభక్తి ఫలము:
12.
తల్లి, తండ్రి, గురువు తత్వ సమానులు,
ఇలపైన ఉన్న ప్రత్యక్ష దేవతలు, వారి
కాలి ధూళి ఒక్కింత సోకిన,
కలి కాల మందలి కలుషములు తీరు. ||గురువులు||

రమాకాంతరావు చాకలకొండ శనివారం, 30 జూన్ 2012

Tallini Minchina

పల్లవి.
తల్లిని మించిన దైవము ఏవరు?
తల్చగ భువిలో తెల్లముగ! ||తల్లి||

అనుపల్లవి.
ఎల్ల లోకములు ఏలెడి వాడే,
తల్లి ఘనతను చాటెనుగ. ||తల్లి||

1.
రాముడు జనని కౌసల్యమ్మ,
ప్రేమామృతము పొందెనుగ,
శ్యాముడు యిద్దరి తల్లుల బిడ్డై,
అమ్మ ప్రేమను బడసెనుగ. ||తల్లి||

2.
శ్రీనివాసుడు వకుళాదేవి,
కన్న బిడ్డగ మెలిగెనుగ ,
ఎన్ని కీర్తనలు వ్రాసి పొగడిన,
అన్ని తల్లికి తక్కువెగ. ||తల్లి||

3.
భువిన దేముడు తనకు మారుగ ,
దేవి అమ్మను పంపెనుగ,
నవ మాసములు మోసిన తల్లికి,
నవనము చేసి కొల్తురుగ . ||తల్లి||

4.
అల్లిన కవితలు ఆరాధనతో ,
చల్లని తల్లికి అర్పణగ,
మల్లెల వన్నెల మమతల వల్లిని,
ఉల్లము భక్తిగ పొగడెనుగ . ||తల్లి||

రమాకాంతరావు చాకలకొండ శనివారం, మే , 12 2012

Tallini Minchina

Dedicated to All Mothers

పల్లవి.
జన్మ నిచ్చిన తల్లి కమ్మని గర్భముకు,
అనురాగ, అభిమాన అభినందనం. ||జన్మ||

అనుపల్లవి.
ప్రాణ మిచ్చిన తల్లి పావన వక్షముకు,
మన్ననల తోటి హరి చందనం. ||జన్మ||

1.
ముద్దు పెట్టిన తల్లి మాధుర్య అధరముకు,
ఎదలోన భక్తిగ ఆభివందనం,
ముద్దులతో ముద్దలు నోటి కందించిన,
మాధుర్య హస్తముకు హరి చందనం. ||జన్మ||

2.
ఎత్తు కొని తిప్పిన అందాల కరములకు,
చేతులెత్తి చేయు ఆభివందనం ,
చదువులు, బుద్దులు చక్కగ గరిపిన,
మాత్రు మూర్తికి ప్రేమ హరి చందనం. ||జన్మ||

3.
నడక నేర్పను, బుడత తడబడగ పట్టుకొను ,
పడతి మృదు హస్తముకు అభివందనం,
నడకతో పాటుగ నడతను నేర్పిన, పూ
బోడి పావనికి హరి చందనం . ||జన్మ||

4.
ఉగ్గు పోయను కాస్త బుగ్గ గిల్లిన తల్లి,
నిగ్గైన వేలుకు అభివందనం,
మగ్గి పోకుండ మల, మూత్రములు తుడుచు,
సుగాత్రి సేవలకు హరి చందనం. ||జన్మ||

5.
ప్రేమాను రాగములు కలబోసి పెంచిన,
అమ్మ పాదములకు అభివందనం.
ఇమ్ముగ భువిలోన నెమ్మిని జూపిన,
కమ్మని అమ్మకు హరి చందంనం. ||జన్మ||

రమాకాంతరావు చాకలకొండ ఆదివారం, 22 ఏప్రిల్ 2012

A song in Honor of Sri ALN Murthy

A song in Honor of Sri ALN Murthy:

పల్లవి.
మానవ సేవయే మాధవ సేవని,
అనిశము భావించు అమృత మూర్తి. ||మానవ||

అనుపల్లవి.
ఆశయ సిద్ధికై ఆరాట పడువాడు,
నిస్వార్ధ స్ఫూర్తి గల నరసింహమూర్తి. ||మానవ||

1.
సత్యవతి నోముల పంటగ పుట్టి,
తాత, తండ్రుల తనరు పేరు నిలబెట్టి,
అతిశయము జూపక, అందరితో మెలిగెడి,
నిత్య కృషీవలుడు నరసింహ మూర్తి. ||మానవ||

2.
విశాఖ జిల్లా నిర్మాణ సమితితో,
దేశ సేవ చేయ ఆశయము చేబూని,
లేశమైన తన స్వార్ధము చూపక,
శోషితుల సేవించు నరసింహ మూర్తి. ||మానవ||

3.
సమాజ సేవకై సతతము కృషిచేయ,
గ్రామ సిరి సంస్థకు ప్రాణము పోసి,
గ్రామసిరే తన సిరిగ గట్టిగ భావించు,
ప్రేమ స్వరూపుడు నరసింహ మూర్తి. ||మానవ||

4.
విద్య, వైద్య, విత్త, వ్యవసాయ రంగముల,
చిత్త శుద్ధి తోటి చెలగి సేవ చేసి,
ఆత్మ నివేదనతో అన్ని సాధించిన,
మధుర మృదు హృదయుడు నరసింహమూర్తి. ||మానవ||

5.
మదిలోన నమ్మిన మహనీయ భావములు,
సాధనతో సాధించి సాకారము చేసి.
మేదిన అందరిలో మంచి వాడు యన్న,
ఖ్యాతి గొన్న ఘనుడు నరసింహమూర్తి. ||మానవ||

6.
ఉగ్ర నరశింహుని పేరున్నగాని,
నిగ్రహము గల్గిన నిర్మల హృదయుడు,
సగుణ, సహృదయ సంపన్న శీలురలో,
అగ్ర గణ్యుడు మన నరశింహమూర్తి. ||మానవ||

7.
పిల్ల పాపలతోటి పది దశాబ్దములు
అలరు ఆరోగ్యము, ఐస్వర్యము కల్గ, సప్త
శైలపతి దీవేనలు చేగొని,
వెలుగు బాటన సాగు నరసింహమూర్తి. ||మానవ||

రమాకాంతరావు చాకలకొండ శనివారం, 21 ఏప్రిల్ 2012

Manava