Monthly Archives: October 2012

evaro vaaru kaaru

పల్లవి.
ఎవరో వారు కారు, పరువాల మరదలే వారు,
సరదాగ నా హృదయము నేలే, సరసిజ కోమలి వారు.. ||గంధము||

అనుపల్లవి.
పల్లవిగ నా హృదయ వీణపై,
చల్లగ పలికెడి వారు ||గంధము||

1.
సంగీత సరిగమ వారు,
మంగాంబ పేరు గల వారు,
నింగి రంగు నా ఎద శృంగముపై,
మంగళ రూపము వారు. ||గంధము||

2.
సన్నని కంఠము వారు,
నును సన్నని మేను వారు,
సన్నని ప్రేమ మత్తును చిలికి,
కన్నులు కలిపిన వారు. ||గంధము||

3.
తెల్లని తనువు వారు,
మల్లెల మేను వారు,
చల్లని చూపుతో సరసన చేరి,
వలపులు విసిరెడి వారు. ||గంధము|

4.
సువర్ణ శోభల వారు,
భువి లోనే సుందరి వారు,
కవ్వించి, నను కవిలా చేసి,
కవితలు వినెడి వారు. ||గంధము||

5.
కలరవ కంఠము వారు, నా
కలలో కన్నిక వారు,
ఇలలో మంగ పురమున వెలసిన,
అలమేల్ మంగే వారు. ||గంధము||

6.
మరు మల్లె గంధపు వారు,
పరువాల జల్లులే వారు,
తిరు వేంకటగిరి రాణిగ నాతో,
వరములు కురిపెడి వారు. ||గంధము||

రమాకాంతరావు చాకలకొండ సోమవారం, 29 అక్టోబర్ 2012

gandhamu tiyave gopamma

పల్లవి.
గంధము తీయవే గోపమ్మా, గో
విందుని కొలువుకు ఓ యమ్మా! ||గంధము||

అనుపల్లవి.
నంద నందనుని నామము పల్కుచు, ఆ
నందము నొందవే ఓయమ్మా! ||గంధము||

1.
కులుకులు కులుకుచు, కిల కిల నవ్వుచు,
కల కల గాజులు సవ్వడి చేయుచు,
కలికి యశోద కొమరుని కొల్వరే,
నెలతలు నవ్వుచు ఓయమ్మా! ||గంధము||

2.
వలపుతో గంధపు మాలలు యల్లుచు,
తలపుల లోన హరిని తలంచుచు,
అలకల కొలికి అలమేల్ పతికి,
కొలువులు చేయరే ఓయమ్మా! ||గంధము||

3.
కలికి దనపు ఒయ్యారము జూపుచు,
తళ తళ లాడే మేనితో తఱలుచు,
చిలకల కొలుకులు కల కంఠముతో,
చలపతి యనరే ఓయమ్మా! ||గంధము||

రమాకాంతరావు చాకలకొండ ఆదివారం, 28 అక్టోబర్ 2012

Failures are the stepping stones to success

Dear Friends,

Life is a cycle of success and failures, we get one after the other. We should not get depressed when misfortune encounters, take failure as a lesson and work with motivation and strength towards bigger success. Ball when falls down, raises much more heights, same thing with the wave. Boldness leads to a strong personality, who ultimately wins.

Happy Dasara,

Best wises

పల్లవి.
ఓటమికి వెఱచి ఆడుట మానకుము,
ఓటమే గెలుపు సుగమము చేయును. . ||గాఢ||

అనుపల్లవి.
ఎంత కిందకు పడునో, అంత పై కెగయును
బంతిని జూచి బుద్ది తెచ్చు కొనుము ||గాఢ||

1.
పడి లేచి బిడ్డ పరుగులు నేర్చును,
సుడులు తిరిగి అల పై పైకి ఎగయును,
పట్టు బట్టి ఆడి, ఓడి గెలుచుట లోనే
తుట్ట తుదకు దొరకు ఆనందము గనుము. ||గాఢ||

2.
సాలెడు గూడుకై ఎంతో శ్రమ పడును,
గాలి కొంగి కొమ్మ నిల దొక్కు కొనును,
కాలాణు గుణముగ మంచి, చెడు లున్ననూ,
ఫలితము చివరకు శ్రమ జీవికే దొరకు. ||గాఢ||

3.
ప్రేరణ, తపన, పట్టుదల యున్న,
ధరణిలో ఏదైనా సాధింప గలము,
పోరి సాధించిన పరమార్ధము దొరకు,
భీర భావముకు తావుండ రాదు? ||గాఢ||

రమాకాంతరావు చాకలకొండ గురువారం, 18 అక్టోబర్ 2012

Song on 11th the birth day of Lord sri Venkateswra

పల్లవి.
పుట్టుకే లేని పరమ పురుషునికి,
పుట్టిన రోజు పండుగ పాటా? ||పట్టుకే||

అనుపల్లవి.
జనన మరణము లేని జగన్నాధునికి,
జన్మ దిన సంబర జయ జయ గీతా?. ||పట్టుకే||

1.
యిటు నటు లేని వేంకటేశునికి,
పడగ టుయ్యాలలో ప్రేమతో పాటా?
పటుతర ప్రభల పరమ ప్రకాశునిపై ,
ఎటుల పాడుటయో ఇంపైన పాట?. ||పట్టుకే||

2.
పుట్టలో చీమలై పుట్టి, గిట్టెడి నరులు,
పుట్టువడుగు పైన పాడెడి పాటా?
పుట్టు చక్రములోన పాట్నెన్నో పడువారు,
ఎట్టి కేలకు హరి పై ఎలుగెత్తి పాటా? ||పట్టుకే||

3.
తల్లి తండ్రి లేని తత్వ స్వరూపునికి,
ఇలకు విచ్చేయగ ఇమ్మగా పాటా ?
కలిన శేషాద్రిపై వేలసిన స్వామికి,
కలలోన జారుటకు కమ్మని పాట. ||పట్టుకే||

4.
శ్రావణ నక్షత్ర శుభ ఘడియ లందు,
రవి శశి నయనునిపై రమ్యమగు పాట,
భువికి శేషాద్రిపై వచ్చిన ఘడియందు,
అవిరళ ప్రేమతో అమ్మ జోల పాట. ||పట్టుకే||

రమాకాంతరావు చాకలకొండ గురువారం, 11 అక్టోబర్ 2012

Putukeleni