Monthly Archives: August 2012

Indian Flag – JatiGhanathanu

పల్లవి.
జాతి ఘనత దెలుపు జాతీయ జెండా, ప్ర
గతికి, రీతికి, ప్రతీకైన జెండా. ||జాతి||

అనుపల్లవి.
మూడు రంగుల వెలయు ముచ్చటైన జెండా,
నడుమ చక్రము గల నయగారపు జెండా! ||జాతి||

1.
ధీర స్వభావము చాటు కాషాయముతో,
వీర రస ప్రబోధ విద్యోత జెండా,
ధరణి మాతకై ప్రాణ త్యాగము చేసెడి,
శూరల దేశమని తెలుపు నీ జెండా! ||జాతి||

2.
శాంతి పధతమును జూపి, ధవళ
కాంతుల మెరయు, దేదీప్యమాన రంగుల జెండ,
ఎంత ఆపదనైన సత్యమే పల్కమని,
అందరికి తెలిపెడి అందమైన జెండా! ||జాతి||

3.
నమ్మకము తోటి నలుగురు చల్లగ,
ధర్మ పథము లోన సాగుమను జెండ,
సమానత్వము, మంచి, కరుణ స్వభావ,
సమ సమాజ ఉనికి తెలుపు మన జెండా. ||జాతి||

4.
అశోక చక్రము అందముగ మధ్యన,
దేశ ప్రగతిని చాటు దీపికై వెలుగగ,
శ్వాశ పీల్చుకొని న్యాయ, ధర్మము యిచట,
వాసముండేనని తెలుపు నీజెండా! ||జాతి||

రమాకాంతరావు చాకలకొండ మంగవారం, 14 ఆగస్టు 2012

SAug1420121_JatiGhanathanu