Monthly Archives: March 2012

Nandana Ugadi

నందననామ సంవత్యర ఉగాది శుభాకాంక్షలతో

పల్లవి.
నందన వత్యర చైత్ర పాడ్యమి మనకు, ఆ
నంద చందనము అందించు గాక. ||నందన||

అనుపల్లవి.
నంద నందనుడు, యశోద బాలుడు,
డెందములు అందరివి అలరించు గాక! ||నందన||

1.
కులుకు లొలుకు చిగురు కొమ్మలతో వనములు,
ఫల, పుష్ప, పరిమళ గంధముల నిచ్చుచూ, ఆ
కలన్నది లేక అన్నపూర్ణగ మనకు,
చల్లని నీడను అందించు గాక! ||నందన||

2.
వేపూత, మామిడి, చెఱకు, తేనెల వలె,
తీపి, చేదులు ఉండు బ్రతుకుల బాటలో,
ఓపిక, ఉత్యాహ, ధీరతతో శ్రీ జనులు,
కాపురము దిద్దుకొని కమ్మ గుందురు గాక! ||నందన||

3.
షడ్రుచుల పచ్చడి సంతృప్తి సేవించి, అ
రిష్డవర్గముల జ్వాల మదిలో అణచి,
ష’డ్రుచో పేత సుగుణ సాంద్రతతో,
వేడుకగ అందరు వసియింతురు గాక! ||నందన||

4.
ప్రతి యింట, ప్రతి క్షణము, రేతిరి, పగలు,
ఈతి బాధలు లేక, సుఖ, శాంతులు నిండి,
భూతల స్వర్గముగ భారత దేశము,
మేదిన మహా దివ్య ప్రభలొందు గాక! ||నందన||

5.
కవులు, గాయకులు, పంచాగ కర్తలు,
భువిలోని జనులకు శుభములు పల్కుచూ,
దేవుడిచ్చిన తమ దివ్య ప్రతిభలతో,
రవి తేజ మలరగ రాణింతురు గాక! ||నందన||

6.
చీకటి, వెలుగుల చిన్ని యీ జీవితము,
శోక సాగరమనే భావన వదలి,
ప్రగతి పథమును జూపు చక్క నవకాశమను,
ఆకళింతతో జనులు సాగుదురు గాక! ||నందన||

7.
ఆలు, మొగలు, అతి ఆప్యాయత నిండ,
పిల్లలు, పౌత్రులతో, పరమ సంతోషముగ,
ఎల్ల లోకము లేలు వేంకని మరువక,
చల్లగ సుఖముగ జీవింతురు గాక! ||నందన||

8.
బృందావన చారి యదుకుల చంద్రుడు,
కందర్ప దర్పుడు కమనీయ హృదయుడు,
సుందరి రాధతో ప్రతి యింట వెలసి,
అందరిని చల్లగ కాపాడు గావుత! ||నందన||

రమాకాంతరావు చాకలకొండ.

Nandana_Ugadi

Unforgettable Navrang – The poetic love

పల్లవి.
చిక్కులలో పడద్రోసి చీల్చినదే గాని ,
ఎక్కడిచ్చెను శాంతి ఎదకు యీ ప్రేమ? ||చిక్కులలో||

అనుపల్లవి.
ఎక్కడ గానదే ఏమిటీ ప్రేమ?
మక్కువ జూపిన మోము జూపని ప్రేమ! ||చిక్కులలో||

1. మమతల బంధముల ముండ్ల పొదలోకి,
నెమ్మిగ ద్రోసినది నయగారపు ప్రేమ!
నమ్మిన వారి అనురాగము మరచి,
వమ్ము చేసినది బ్రతుకు నీ ప్రేమ! ||చిక్కులలో||

2. ఎనలేని బాధల సాగరంబున ద్రోసి,
మనసు విరచినది, మధుర మను ప్రేమ!
తనువులో తియ్యని బాధ విషము జిమ్మి,
కన్నీరు నింపినది కడకు యీ ప్రేమ! ||చిక్కులలో||

3. మరచి, మరువ లేని మధుర స్వప్నముగ,
మరుల ముండ్లను గుచ్చె ముద్దుల ప్రేమ!
చుర కత్తులు నింపి చీల్చి నా హృదయము,
దూరమై పోయినది దయ లేని ప్రేమ! ||చిక్కులలో||