వెక్కిరించకు వినక ఒక పరి శ్రద్ధగా

Dear Friends,

Good morning. Now a days it became a fashion for some people, to make adverse comments, without going though even once, the contents of our great works like Nigama, Purana Traya, and wealth of literature; on our religion, religious books, Swamiji’s and their sayings. Before doing that they should read, understand and make comments. That is called constructive criticism. For those this is my advise.

పల్లవి. వెక్కిరించకు వినక ఒక పరి శ్రద్ధగా,
వెక్కసపు భారత, భాగవత చరితలు. ||వెక్కిరించకు||

అనుపల్లవి. నిక్కము ఎఱుగక, నిగమ రహస్యములు,
మొక్కుబడి కైన వినక రామాయణము. ||వెక్కిరించకు||

1. యిందులో నీతులు, యిందులో శాస్త్రములు,
పొందైన ఙ్ఞాన సంపద యుండగ,
ఎందుకు చేసెదవు వ్యర్ధ విమర్శలు ,
యిందులో ఉన్న విఙ్ఞాన మెఱుగక. ||వెక్కిరించకు||

2. జీవన మార్గము చక్కగ తెలపెడి,
అవిరళ సుఙ్ఞాన మార్గము నేర్పెడి,
భువిలోన బ్రతుకు సుగమము చేసెడి,
కవి చేతల మధుర సారము నేర్వక. ||వెక్కిరించకు||

3. వ్యక్తి, సంఘము, జాతి నీతులు తెలిపెడి,
చక్కని ఙ్ఞాన సుధ యిక్కడే ఉండ,
ఎక్క డెక్కడో వెతకి వ్యర్ధమై పోయెదవు,
నిక్కమగు సత్యము చక్కగ నేర్వక. ||వెక్కిరించకు||

4. కర్తవ్య దీక్షలో కార్య సాధన విధులు,
సర్వ మానవ సేవ, సమ భావ బోధలు,
చరమ శాంతికి వలయు జీవన పద్ధతులు,
సర్వము నేర్పెడి గ్రంధములు చదువక. ||వెక్కిరించకు||

రమాకాంతరావు చాకల కొండ ఆదివారం, 20 అక్టోబర్ 2013

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Captcha Captcha Reload