Andhra Song

పల్లవి. ఆంధ్రావనికి వందనము, అమృత కలశకు వందనము,
సుందర ధాత్రికి వందనము, సశ్య శ్యామకు వందనము. ||ఆంధ్రా||

అనుపల్లవి. అనునయ శీల, అనుపమ శోభ, అన్నపూర్ణకు వందనము
సునిసిత ఙ్ఞాన, శుభ గుణ సోన, సీమాంధ్ర మాతకు వందనము. ||ఆంధ్రా||

1. రాయలేలిన బంగరు భూమి సింగారములకు వందనము, న
న్నయ, తిక్కన, ఎఱ్రాప్రగడల కన్న తల్లికి వందనము. ||ఆంధ్రా||

2. విజయవాడ, నెల్లూరు తిరుమల, సుందర సీమకు వందనము,
విజయ, విశాఖ, కాకినాడ – సువిశాల భూమికి వందనము. ||ఆంధ్రా||

3. రవి తేజులు, అల్లూరి, రాముల, వీర మాతకు వందనము,
వావిలాల, కాశీ, కేసరుల వనజ గర్భకు వందనము. ||ఆంధ్రా||

4. మంగళగిరి, సింహాచల క్షేత్ర, అన్నవరాలకు వందనము, త్రి
లింగ క్షేత్ర, దుర్గామందిర, తిరుమల ధాత్రికి వందనము. ||ఆంధ్రా||

5. త్యాగరాజ, క్షేత్రయ, వేమనల మాతృమూర్తికి వందనము,
యోగి బ్రహ్మము, అన్నమయ్యల, అమ్మకు భక్తిగ వందనము. ||ఆంధ్రా||

6. వీణామృత, మధుగాన, గమక ప్రియ, నాట్య వినోదకు వందనము,
వాణి సుత, వైతాళిక, వీరుల వన్నెల తల్లికి, వందనము. ||ఆంధ్రా||

7. శ్రామిక, కార్మిక, హాలిక జీవుల సన్నుత సురభికి వందనము,
విశ్వములో ప్రతి లేని ప్రగతి గల, నవ సీమాంధ్రకు వందనము.. ||ఆంధ్రా||

రమాకాంతరావు చాకలకొండ గురువారం, 03 జూలై 2014

Download (PDF, 49KB)

పప్పు –మహత్యం

పల్లవి. అప్పడం, అన్నము, పప్పు , నెయ్యి కలిపిన,
చెప్పలేని పని గదా చేతికి నోటికి. ||ముద్ద||

అనుపల్లవి. దప్పళం, వడియము, దప్పముగ కలసిన, (దప్పముగ = దట్టముగ, బాగుగ)
దబ దబ దబాయించ దివ్యము నోటికి. ||ముద్ద||

1. ముద్ద, ముద్ద చేతిలో ముద్దుగ కలుపుచూ,
వద్దు, వద్దు అనకుండ ఆవు నేయి అలముచూ, (అలముచూ = పూయుచూ)
దప్పికైన యించుక లెక్కచేయకుండిన,
జొప్పిం వచ్చులే యింక రెండు ముద్దలు. ||ముద్ద||

2. దోసకాయ, పాలకూర, చింత చిగురు పప్పులు,
ఆశ తీర్చు మామిడి టమాటో పప్పులు,
మోసులెత్తు మానసం, ముద్ద ముద్ద మెచ్చగా,
రాసిగ కలపరా రాసమే నీటికి. (రాసము = రసము, సల్లాపము) ||ముద్ద||

3. ఆవకాయ, మాగాయ, టమాటో పచ్చడి,
చేవగ కలిపిన చిత్రమెగా పప్పుతో,
బ్రేవుమని ప్రేవుల ఆరాటము తీర్చుచూ,
ఆవురావురు యనగ అందించు నోటికి. ||ముద్ద||

4. పప్పు తోటే భీముడు కొట్టాడు విజయము,
పప్పు తినే దమయంతి నచ్చిందట నలుని,
పప్పు యిచ్చు తెలివితో వచ్చులే కవితలు,
పప్పంటే అప్పడిగి అగు నెంతో యిష్టము. (అప్పడు = వేంకటేశుడు) ||ముద్ద||

రమాకాంతరావు చాకలకొండ గురువారం, 31 అక్టోబర్ 2013

Download (PDF, 48KB)

Birth day song on Swami Tridandi Chinna Jiyar Swami

Dear friends,

Jai Srimannarayana,

Please find attached song or see below and also listen to the attachment in MP3. This is Happy birthday song on Chinna Jiyar Swami.

Please visit the following websites for songs on Lord Srivenkataswra and subscribe to get 24 CD’s on Lord SriVenkataswra.

Visit: http://ramakantha.com /
http://lordbalajisongs.com/
Best regards.

Ramakantha Rao Chakalakonda

పల్లవి. వెలుగులు చిమ్మే విష్ణు ప్రభల తోటి,
ఇలపైకి అరుదెంచె యతిరాజ చంద్రుడు . ||వెలుగులు||

అనుపల్లవి. దీపావళి దివ్య పుణ్య తిధి నాడు,
అపురూప దీప్తులతో అవని కరుదెంచె . ||వెలుగులు||

1. అల్లారు ముద్దుల వేంకని తనుయుడిగ,
అలమేలు మంగమ్మ పుణ్య గర్భము నందు,
కలి కల్మష హర కేశవ మంత్రము,
ఎల్లరికి అందించు సూర్యు డుదయించె. ||వెలుగులు||

2. విఙ్ఞాన జ్యోతుల వైష్ణవము వెదజల్ల,
ప్రఙ్ఞాన చంద్రుడు పుడమికి వచ్చె,
అఙ్ఞాన తిమిరము అంత మొందించను,
సుఙ్ఞాన సారమే స్వామి రూపము నొచ్చే. ||వెలుగులు||

3. చిన్న జీయరులై చిరు నవ్వు నవ్వగ,
పున్నమిగ ఙ్ఞానము భూమిపై వచ్చె,
వెన్నుని కీర్తులు విశ్వముకు చాటుచూ,
ఎన్నెన్నో కార్యములు స్వామి ఒనరించె. ||వెలుగులు||

4. మంగమ్మ తనయుడా! మంగళాకారుడా!
గంగ జనకుని సుతుడా! ఙ్ఞాన ప్రదాతా!
వంగి నీ పదములకు వినయముగ మ్రొక్కేము,
మంగళా శాసనము మాకిమ్ము స్వామి. ||వెలుగులు||

రమాకాంతరావు చాకలకొండ. M.Sc, MA, M.Com, M.Tech, M.Tech(IT), MBA, MCA, M.Phil, PGDM, PG Dip IR&PM బుధవారం, 25 సెప్టెంబర్ 2013

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


Download (PDF, 53KB)

వెక్కిరించకు వినక ఒక పరి శ్రద్ధగా

Dear Friends,

Good morning. Now a days it became a fashion for some people, to make adverse comments, without going though even once, the contents of our great works like Nigama, Purana Traya, and wealth of literature; on our religion, religious books, Swamiji’s and their sayings. Before doing that they should read, understand and make comments. That is called constructive criticism. For those this is my advise.

పల్లవి. వెక్కిరించకు వినక ఒక పరి శ్రద్ధగా,
వెక్కసపు భారత, భాగవత చరితలు. ||వెక్కిరించకు||

అనుపల్లవి. నిక్కము ఎఱుగక, నిగమ రహస్యములు,
మొక్కుబడి కైన వినక రామాయణము. ||వెక్కిరించకు||

1. యిందులో నీతులు, యిందులో శాస్త్రములు,
పొందైన ఙ్ఞాన సంపద యుండగ,
ఎందుకు చేసెదవు వ్యర్ధ విమర్శలు ,
యిందులో ఉన్న విఙ్ఞాన మెఱుగక. ||వెక్కిరించకు||

2. జీవన మార్గము చక్కగ తెలపెడి,
అవిరళ సుఙ్ఞాన మార్గము నేర్పెడి,
భువిలోన బ్రతుకు సుగమము చేసెడి,
కవి చేతల మధుర సారము నేర్వక. ||వెక్కిరించకు||

3. వ్యక్తి, సంఘము, జాతి నీతులు తెలిపెడి,
చక్కని ఙ్ఞాన సుధ యిక్కడే ఉండ,
ఎక్క డెక్కడో వెతకి వ్యర్ధమై పోయెదవు,
నిక్కమగు సత్యము చక్కగ నేర్వక. ||వెక్కిరించకు||

4. కర్తవ్య దీక్షలో కార్య సాధన విధులు,
సర్వ మానవ సేవ, సమ భావ బోధలు,
చరమ శాంతికి వలయు జీవన పద్ధతులు,
సర్వము నేర్పెడి గ్రంధములు చదువక. ||వెక్కిరించకు||

రమాకాంతరావు చాకల కొండ ఆదివారం, 20 అక్టోబర్ 2013

Vara Venkatesudu

పల్లవి. వర వేంకటేశుడు వర్ధిల్ల అందించే,
శారద పుత్రునికి శుభము శుభము . ||వర||

అనుపల్లవి. మంగమ్మ నాధుడు మంగళము అని యిచ్చె,
మంగళా శాసనము శుభము శుభము. ||వర||

1. ఆయు రారోగ్యములు, అష్టలక్ష్మీ కృపలు,
తోయజాక్షి యిచ్చె శుభము శుభము,
వేయి నామముల వెన్నుడు మీకిచ్చె,
మాయని సంతసము శుభము శుభము. ||వర||

2. మోహనా కారుడు మంగమ్మ పతి యిచ్చె,
యిహ పర భాగ్యములు శుభము, శుభము,
స్నేహ , కరుణా శీలి, శ్రీనివాసుడు యిచ్చె,
సహన, శాంతి, ఖ్యాతి శుభము, శుభము. ||వర||

3. చోడవరపు వారి అష్ఠమ బిడ్డకు,
నేడు, నిన్న, రేపు శుభము, శుభము
మేటి విద్యలలో మింటి కెగసిన మీకు ,
దీటుగ అన్నింట శుభము, శుభము. ||వర||

4. అమ్మ సీతమ్మ, శేఖరుల బిడ్డకు,
కామితార్ధములతో శుభము శుభము,
కొమ్మ రేణుక – మీ , కన్న బిడ్డలకు,
కొమ్మని హరి యిచ్చె శుభము, శుభము. ||వర||

రమాకాంతరావు చాకలకొండ,
M.Sc, MA, M.Com, M.Tech, M.Tech(IT), MBA, MCA, M.Phil, PGDM, PG Dip IR&PM

Date: శనివారం, 21 సెప్టెంబర్ 2013

Download (PDF, 44KB)